Viral Video: అబ్బ ఘాటెక్కింది.. క్యాప్సికమ్ రుచి చూసి కుక్క ఏం చేసిందో తెలుసా..? ఫన్నీ వీడియో..
Dog Viral Video: నెట్టింట తాజాగా.. ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.. అందులో కుక్క మొదటిసారి క్యాప్సికమ్ (మిర్చి) రుచి చూస్తుంది. రుచి చూసిన అనంతరం

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో (social media) నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఈ వీడియోలను చూసేందుకు నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా.. ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.. అందులో కుక్క మొదటిసారి క్యాప్సికమ్ (మిర్చి) రుచి చూస్తుంది. అయితే.. రుచి చూసిన అనంతరం కుక్కకు దిమ్మతిరుగుతుంది. వాస్తవానికి కాప్సికమ్‌లో తక్కువ ఘాటు, మంట ఉంటుంది. అయితే.. వైరల్ (Viral Video) అవుతున్న ఈ వీడియోలో.. క్యాప్సికమ్ తిన్న కుక్క వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.
వీడియోలో మీరు సోఫాలో కుక్క నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. దాని నోటిలో క్యాప్సికం ముక్క ఉంటుంది. మొదటిసారి క్యాప్సికమ్ రుచి చూసిన తర్వాత కుక్క ప్రతిచర్య చూస్తే షాకవుతుంది. ఎందుకంటే.. క్యాప్సికమ్‌ను రుచి చూసిన వెంటనే కుక్కకు మంట పుట్టిందనుకుంటా.. అది సోఫాలో పడుకొని వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి..
వైరల్ వీడియో..
ఈ కుక్క ప్రతిచర్యను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. యూజర్లు దీనిపై పలు రకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. క్యాప్సికమ్‌ను.. డాగీని రుచి చూసే ఈ విధానం తెగ నచ్చిందంటూ ఒక యూజర్ పేర్కొనగా.. క్యాప్సికమ్ మంటకు తట్టుకోలేక కుక్క అలా చేసిందంటూ మరో యూజర్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను redditలో షేర్ చేశారు.
Also Read: