Viral Video: వామ్మో.. ట్రాఫిక్‌లో సైకిల్‌పై అదిరిపోయే స్టంట్.. వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..
Cycle Stunt Viral Video: కుర్రకారు.. నుంచి పెద్దల వరకు చాలామంది విన్యాసాలు చేస్తుంటారు. అయితే.. స్టంట్ చేస్తూ అనేక సార్లు ప్రాణాలు మీదకు సైతం తెచ్చుంకుంటుంటారు. స్టంట్స్ ఏమైనప్పటికీ..

Cycle Stunt Viral Video: కుర్రకారు.. నుంచి పెద్దల వరకు చాలామంది విన్యాసాలు చేస్తుంటారు. అయితే.. స్టంట్ చేస్తూ అనేక సార్లు ప్రాణాలు మీదకు సైతం తెచ్చుంకుంటుంటారు. స్టంట్స్ ఏమైనప్పటికీ.. అలా చేసే ప్రతి ఒక్కరికీ కష్టమైన పనే. వాహనాలతో నిండిన రోడ్డుపై.. కదులుతున్న సైకిల్‌పై నిలబడి ఓ వ్యక్తి అద్భుతమైన విన్యాసాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (social media) లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు. ఈ వీడియో (Viral Video) చూసి చాలా మంది నెటిజన్లు.. ‘‘వామ్మో చూస్తుంటే.. మాకే భయమేస్తుంది.. అలా ఎలా స్టంట్ (cycle stunt) చేశాడ్రా బాబోయ్’’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై సైకిల్ తొక్కుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే.. అకస్మాత్తుగా సైకిల్‌పై నిలబడి విన్యాసాలు చేస్తున్నాడు. అయితే.. సైకిల్‌పై ఉన్న ఆ వ్యక్తి బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై అలాంటి విన్యాసం ఎలా సాధ్యమైందంటూ పేర్కొంటున్నారు. చాలా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా వస్తూ పోతున్నాయి. ఈ క్రమంలో సైకిల్ పై ఆ వ్యక్తి స్టంట్ తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. స్టంట్ (Stunt) చేస్తున్నప్పుడు అతను కేరింతలు కొడుతూ కనిపిస్తున్నాడు. చివరకు ట్రాఫిక్ హెవీగా ఉండటంతో సైకిల్ దిగిపోయాడు.
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 30 వేలకు పైగా వీక్షించారు. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారులు ఆ వ్యక్తి ఫీట్‌ని చూసి ప్రశంసిస్తున్నారు. అమేజింగ్.. అంటూ ప్రశంసించడంతోపాటు.. నడిరోడ్డుపై ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సూచిస్తున్నారు.
Also Read: