Viral Video: బాబోయ్.. ఈ పెళ్లి కూతురు వీరలెవల్. పెళ్లైన మొదటిరోజే అత్తారింట్లో వరుడితో గొడవ.. చివరకు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని ఆశ్చర్యంగా కలిగిస్తాయి.. ఇక ఇటీవల వధువరులకు డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివాహం అనంతరం అత్తవారింట్లో వధువుకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతుంటారు. ఈ సందర్భంలో వధువరులతో చిన్న చిన్న ఆటలు ఆడించడం.. అల్లరి చేయం ఇలా ఒకట్టేమిటీ ఎన్నో ఆనందక్షణాలు ఉండిపోతాయి. ఈ క్రమంలో వధువు.. వరుడితో అల్లరిగా గొడవ పెట్టుకోవడం కూడా సరదాగా ఉంటుంది. తాజాగా ఓ పెళ్లి కూతురు తన అత్తవారింట్లో నిర్వహించే ఓ సంప్రదాయపు ఆటలో వరుడితో చిన్నపాటి గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వధువరులకు పెళ్లి తర్వాత అత్తవారింట్లో నిర్వహించే ఆచారాలను జరుపుతున్నారు. ఇందులో ఒక పాత్రలో పాలు.. గులాబీ రెక్కలు వేసి అందులో ఒక ఉంగరం వేసి వధువరులను తీయమని చెప్పారు. అయితే ఎంతో ఉత్సాహంగా ఈ జంట ఉంగరం తీసేందుకు పోటీ పడింది. ఉంగరం కోసం పోటీ పడుతున్న సమయంలో ముందుగా ఉంగరం పెళ్లి కొడుకు దొరకడంతో.. వెంటనే వధువు అతని చేతుల్లోంచి ఉంగరాన్ని లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ వరుడు ఏమాత్రం తగ్గకుండా.. ఆ ఉంగరాన్ని బయటకు తీయడంతో పెళ్లి కూతురు ఓడిపోయింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వధువు అల్లరి పనులను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తు్న్నారు.
View this post on Instagram
Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)
Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..