కెనడాలో విచిత్రం.. గర్భిణీలో పిండం కడుపులో కాకుండా లివర్‌లో పెరుగుతుంది..

| Edited By: Anil kumar poka

Dec 21, 2021 | 1:28 PM

Canada Woman: వైద్యులను భగవంతుని మరొక రూపంగా కొలుస్తారు. ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు.

కెనడాలో విచిత్రం.. గర్భిణీలో పిండం కడుపులో కాకుండా లివర్‌లో పెరుగుతుంది..
Pregnancy Compressed
Follow us on

Canada Woman: వైద్యులను భగవంతుని మరొక రూపంగా కొలుస్తారు. ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు వారి ముందుకు వస్తాయి. ఇది వారిని ఆశ్చర్యపరుస్తుంది. కెనడాలోని వైద్యుల ముందు ఇలాంటి షాకింగ్ కేసు ఒకటి వచ్చింది. ఈ కేసు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిల్లలు సాధారణంగా స్త్రీల గర్భంలో అభివృద్ధి చెందుతారు. కానీ కెనడాలో ఒక గర్భిణీలో పిండం కాలేయంలో పెరుగుతోంది. వైద్యులు ఈ కేసును ‘అత్యంత అరుదైన’ కేసుగా అభివర్ణించారు.

మీడియా నివేదికల ప్రకారం.. మహిళ వయస్సు 33 సంవత్సరాలు. ఈమె గర్భం దాల్చిన 49 రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చి సోనోగ్రఫీ చేయించుకుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. స్త్రీ కడుపులో బదులుగా ఆమె కాలేయంలో పిండం కనిపించింది. దీంతో ఆ మహిళకు ఎక్టోపిక్ గర్భం ఉందని వైద్యులు చెప్పారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ విచిత్రమైన ‘గర్భధారణ’ వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ సందర్భంలో మహిళను కాపాడవచ్చు. కానీ కాలేయంలో పెరుగుతున్న బిడ్డ జీవితాన్ని కాపడలేమని వైద్యులు చెప్పారు. అదే జరిగింది కూడా. వైద్యులు ఆపరేషన్ ద్వారా మహిళ ప్రాణాలను కాపాడారు కానీ పిండాన్ని రక్షించడంలో విఫలమయ్యారు.

ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు సోషల్ మీడియాలో ఈ విషయానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లు మిలియన్ల సార్లు వీక్షించారు. ఈ వింత కేసు గురించి తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) ప్రకారం.. కాలేయంలో గర్భం దాల్చడం చాలా అరుదు. దీనిని ఎక్టోపిక్ గర్భం అంటారు. ప్రపంచంలో ఇప్పటివరకు 13-14 కేసులు మాత్రమే ఇలా నమోదు కావడం విశేషం.

బిజినెస్‌లో ప్రభుత్వ బ్యాంకులను అధిగమిస్తున్న ప్రైవేట్‌ బ్యాంకులు.. కారణం ఏంటో తెలుసా..?

Electric Tractor: త్వరలో భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ..

KL Rahul: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..