Mother Marriage: తల్లి రెండో పెళ్లిని సోషల్ మీడియాలో పంచుకున్న కుమార్తె.. వైరల్‌గా మారిన వీడియో.
భర్తతో విడిపోయిన లేక భర్త చనిపోయినా పిల్లలున్న తల్లులు సాధారణంగా రెండో పెళ్లి చేసుకోరు. దానికి రెండు కారణాలు పిల్లల భవిష్యత్, రెండోది సమాజం..
భర్తతో విడిపోయిన లేక భర్త చనిపోయినా పిల్లలున్న తల్లులు సాధారణంగా రెండో పెళ్లి చేసుకోరు. దానికి రెండు కారణాలు పిల్లల భవిష్యత్, రెండోది సమాజం.. అయితే ఓ చోట కూతురే తల్లికి రెండో పెళ్లి చేసింది. తన తల్లి రెండో పెళ్లిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. alphaw1fe అనే ఈ వినియోగదారు తన తల్లి రెండో పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.
మొదటి ట్వీట్‌లో అమ్మాయి తల్లి పెళ్లి రోజుకు ముందు మెహందీని వేసుకుంటున్న ఫొటో ట్వీట్ చేశారు. ఆ ఫోటోతో పాటు.. ‘అమ్మ పెళ్లి చేసుకుంటుందంటే నమ్మలేకపోతున్నా’ అని క్యాప్షన్ రాసింది. అమ్మాయి తన తల్లి తన ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్న మరొక ట్వీట్, చిత్రాలు వీడియోలను పంచుకుంది. ఆమె అందంగా కనిపించడం లేదా? ఆమె వారి వివాహ వేడుక యొక్క సంగ్రహావలోకనం కూడా పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పటివరకు 21 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్స్‌లో ఈ జంటను ప్రజలు అభినందిస్తున్నారు.
GURL IM NOT CRYING pic.twitter.com/r79j2VYS6H
— mommy (@alphaw1fe) December 17, 2021
Read Also.. చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. భార్యకు మరో పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..