Knowledge: కరెన్సీ నోట్లపై ఈ బ్లాక్ లైన్స్ ఎందుకో తెలుసా.? వీటి ఉపయోగం ఏంటంటే..
కరెన్సీ నోట్ల తయారీలో అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. దొంగ నోట్ల తయారీకి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నోట్లను రూపొందిస్తుంటారు. ఇక చూసే కరెన్సీ నోటులో మనకు తెలియని...

కరెన్సీ నోట్ల తయారీలో అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. దొంగ నోట్ల తయారీకి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నోట్లను రూపొందిస్తుంటారు. ఇక చూసే కరెన్సీ నోటులో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో కరెన్సీ నోటుకు చివరలో ఉండే బ్లాక్ లైన్స్ ఒకటి. మీరు కూడా నోట్లపై ఉండే ఈ బ్లాక్ లైన్స్ గమనించే ఉంటారు. ఇంతకీ ఈ లైన్స్ ఎందుకు ప్రింట్ చేస్తారు.? వీటి వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బ్లాక్ లైన్స్‌ను బ్లీడ్ మార్క్స్ అని పిలుస్తారు. దృష్టి లోపం ఉన్న వారు నోట్లను గుర్తించడానికి ఈ లైన్స్ ఉపయోగపడతాయి. నోటు విలువ ఎంతో చేతితో టచ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అంధులు ఈ బ్లాక్ లైన్స్‌ను తడమడం ద్వారా కరెన్సీ వ్యాల్యూను లెక్కకడతారు. అందుకే మనకు కనిపించే దాదాపు అన్ని నోట్లపై ఈ లైన్స్ ముద్రిస్తారు. లైన్స్ ద్వారా కరెన్సీ విలువను ఎలా గుర్తిస్తారనేగా మీ సందేహం. దానికి ఓ లెక్క ఉంది. ఎన్ని లైన్స్ ఉంటే ఏ నోటో ఇలా తతెలుసుకోవాలి..
* 100 రూపాయల నోటులో రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి.




* 200 రూపాయల నోటు పై రెండు వైపులా నాలుగు గీతలు, ఉపరితలం పై రెండు జీరోలు ఉంటాయి.
* ఇక 500 రూపాయల నోటుపై 5 గీతలు ఉంటాయి.
* 2000 రూపాయల నోటుపై రెండు వైపులా ఏడు లైన్లు ఉంటాయి. మొత్తం 14 లైన్స్ ఉంటాయి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..