Knowledge: గ్యాస్ సిలిండర్‌పై కనిపించే ఈ అంకెలేంటో తెలుసా.? దేనికి సూచనంటే..
Knowledge: ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఒకప్పుడు అంటే కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌవ్‌లను ఉపయోగించే వారు కానీ ప్రస్తుతం ఏ ఇంటిలో చూసినా గ్యాస్ స్టౌవ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్..
Knowledge: ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఒకప్పుడు అంటే కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌవ్‌లను ఉపయోగించే వారు కానీ ప్రస్తుతం ఏ ఇంటిలో చూసినా గ్యాస్ స్టౌవ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే గ్యాస్ సిలిండర్‌పై కొన్ని అంకెలు ఉండడాన్ని గమనించే ఉంటారు. కానీ మనకెందులే అన్నట్లు ఊరుకుంటాము. కనీసం దాని అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అయితే ఆ అంకెల వెనక ఉన్న మర్మం తెలిస్తే మాత్రం ఇకపై ఇంటికి గ్యాస్ సిలిండర్ రాగానే వెంటనే ఆ నెంబర్‌నే చూస్తారు.
ఇంతకీ సిలిండర్‌పై ఉన్న ఆ అంకెల ఉద్దేశమేంటంటే.. సాధారణంగా ప్రతీదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే సిలిండర్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్‌ని చెప్పేవే ఈ అంకెలు. సహజంగానే సిలిండర్‌పై కనిపించే అంకెల్లో ఒక ఇంగ్లిష్ లెటర్ ఆ తర్వాత రెండు సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగానే సదరు సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్ ఏంటో తెలుస్తుంది.
A (జనవరి నుంచి మార్చ్), B (ఏప్రిల్ నుంచి జూన్), C (జూలై నుంచి సెప్టెంబర్), D (అక్టోబర్ నుంచి డిసెంబర్) అని అర్థం. ఇక అపక్కన ఉండే నెంబర్లు ఏడాదికి సూచన. ఉదాహరణకు పైన ఫొటోలో ఉన్న సిలిండర్ పై 13 అని ఉంది. అంటే 2013 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సదరు సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్ అని అర్థం. దీని ద్వారా గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్ క్వాలిటీని చెక్ చేస్తారు. ఏవైనా లీకేజీలు ఉంటే వాటిని సరి చేసి మళ్లీ కొత్త తేదీ మార్చి కస్టమర్లకు పంపిస్తారు. ఒకవేళ సిలిండర్ జీవిత కాలం ముగిస్తే దానిని స్క్రాప్‌కు పంపిస్తారు. చూశారుగా సిలిండర్‌పై ఉన్న ఈ అంకెల సీక్రెట్ ఏంటో.. మరి ఓసారి మీ ఇంట్లో ఉన్న సిలిండర్ గడువు ముగిసిందో లేదో చెక్ చేసుకోండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..