AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్ చూస్తే..

ఢిల్లీకి అసలేమైంది.? అక్కడ కొందరు ప్రవర్తిస్తున్న తీరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. వాళ్లు చేసే తప్పుడు పనులు, వెకిలి చేష్టలు నెటిజన్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.

Viral Video: ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్ చూస్తే..
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 18, 2024 | 1:30 PM

Share

ఢిల్లీకి అసలేమైంది.? అక్కడ కొందరు ప్రవర్తిస్తున్న తీరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. వాళ్లు చేసే తప్పుడు పనులు, వెకిలి చేష్టలు నెటిజన్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ మెట్రో రైళ్లలో జరిగిన అసభ్యకర సంఘటనలు.. నెట్టింట తెగ వైరల్ కాగా.. ఇప్పుడు ఢిల్లీ బస్సులు కనిపించిన దృశ్యాలకు జనాలు బిత్తరపోయారు. ఇదేంటి.. ఛీ.. ఛీ.. అంటూ నోటి మీద వేలేసుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అందరూ వాడే ప్రజారవాణా.. ఆర్టీసీ బస్సు.. ఇక ఆ బస్సులోకి ఓ మహిళ.. ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. ఆమెను అలా చూసిన ఇతర ప్రయాణీకులు దెబ్బకు అవాక్కయ్యారు. ఇదేంటి ఇలా వచ్చేసింది ఈమె అనుకుంటూ కొందరు చెవులు కొరుక్కోగా.. మరికొందరేమో తల పక్కకు పెట్టుకుని.. వారి సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. ఇక అక్కడే ఉన్న ఓ ముసలామె.. సదరు మహిళను చూడగానే ఓ రియాక్షన్ ఇచ్చింది. ‘ఇదేంటి.. రోజులు మారిపోయాయి అబ్బా.. ఛీ.. ఛీ’ అనుకుంటూ పక్కకు వెళ్లిపోయింది ఆమె కూడా. సదరు మహిళ డైరెక్ట్‌గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేసినట్టు ఉంది. ఆమె జుట్టంతా తడిసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమెను ఎలా బస్సు ఎక్కించారు.? అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘మగాళ్లు ఇలా చేస్తే.. ఏమయ్యేది’ అని మరొకరు.. ‘అసలు సమాజం ఎక్కడికి వెళ్తోందని’ మరొకరు కామెంట్స్ చేస్తూ ధ్వజమెత్తారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ డీటీసీలో జరిగినట్టు తెలుస్తోంది.