AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అట్లుంటది మనతోని.. గూడు కోసం ఏకంగా జింకనే వాడేసిన కాకి.. వీడియో వైరల్

Crow - Deer Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Viral Video: అట్లుంటది మనతోని.. గూడు కోసం ఏకంగా జింకనే వాడేసిన కాకి.. వీడియో వైరల్
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Apr 24, 2022 | 9:22 AM

Share

Crow – Deer Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. ఓ కాకికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా పక్షులు చాలా అందంగా తమ గూళ్ళను ఎలా నిర్మించుకుంటాయో మనందరికీ తెలుసు. అవి ఎండ – వాన – శీతాకాలం సీజన్లను తట్టుకునేలా గూడును నిర్మిస్తాయి. అలాంటి ఇంటిని నిర్మించడం మనుషుల వల్ల కూడా సాధ్యం కాదు. తాజాగా.. ప్రకృతి అందాలను వివరించే అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ (social media) ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. పక్షులు తమ గూడును తయారు చేసుకోవడానికి చెట్ల కొమ్మలను, చిన్న చిన్న కర్రలను, ఆకులను సేకరిస్తాయి. ఆ తర్వాత సౌకర్యవంతమైన గూడును నిర్మించుకుంటాయి. అయితే.. గూడు ఏర్పాటులో జంతువుల వెంట్రుకలను కూడా ఉపయోగిస్తాయని చాలా కొద్ది మందికే తెలుసు. వైరల్ అయిన వీడియోలో.. ఒక కాకి తన గూడును సౌకర్యవంతంగా నిర్మించడానికి జింక వెంట్రులకలను దొంగిలించడం కనిపిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. జింక హాయిగా సేద తీరుతూ ఉంటుంది. ఈ క్రమంలో దాని దగ్గరకు వెళ్లిన కాకి.. దాని తోకకు ఉన్న వెంట్రుకలను దొంగిలించడం కనిపిస్తుంది. జింకను చూస్తుంటే పక్షికి వెంట్రుకలు సేకరించడానికి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే.. కాకులు తమ గూడును నిర్మించుకోవడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.

వైరల్ వీడియో.. 

ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పేరున్న నేచర్ అనే యూజర్ షేర్ చేయగా.. మిలియన్ల మంది వీక్షించారు. దీంతోపాటు వేలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాకిని మించిన తెలివైన పక్షి మరొకటి లేదంటూ యూజర్లు పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: దాహం తీర్చుకోవడానికి వచ్చి మొసలి నోటికి చిక్కిన జీబ్రా.. ఆతర్వాత ఏమైందంటే.. నెట్టింట్లో వీడియో వైరల్‌..

Reliance Future Deal: ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు డీల్ లో వెనక్కు తగ్గిన రిలయన్స్.. ఎందుకంటే..