Viral Video: దాహం తీర్చుకోవడానికి వచ్చి మొసలి నోటికి చిక్కిన జీబ్రా.. ఆతర్వాత ఏమైందంటే.. నెట్టింట్లో వీడియో వైరల్..
అడవిలోని క్రూర మృగాలు పక్క జంతువులను వేటాడితే కానీ వాటి ఆకలి తీరదు. అడవిలో మనుగడ సాగదు. అందుకే సింహం, పులి తదితర జంతువులు నిత్యం జింకలు, జీబ్రాలపై దాడి చేస్తుంటాయి.
అడవిలోని క్రూర మృగాలు పక్క జంతువులను వేటాడితే కానీ వాటి ఆకలి తీరదు. అడవిలో మనుగడ సాగదు. అందుకే సింహం, పులి తదితర జంతువులు నిత్యం జింకలు, జీబ్రాలపై దాడి చేస్తుంటాయి. అదే క్రమంలో క్రూర జంతువుల కంటపడకుండా సాధు జంతువులు తప్పించుకుని తిరుగుతుంటాయి. అయితే దురదృష్టవశాత్తూ ఒక్కోసారి ఆ మాంసహార జంతువులకు చిక్కి ఆహారంగా మారుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా దర్శనమిస్తున్నాయి. ఈ కోవకే చెందిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. నీటిలో ఉండే మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందంటారు. అందుకే నీళ్లలోకి దిగిన జంతువులు ఒకసారి ఈ క్రూర జంతువుకు చిక్కితే.. దాని పని ఇక అయినట్లే. అందుకే ఏనుగు లాంటి జంతువులు కూడా నీటిలో ఉన్న మొసళ్లను చూస్తే జడుసుకుంటుంటాయి.
జీబ్రా పరిస్థితేంటో..
కాగా దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఓ జీబ్రా మొసలి నోటికి చిక్కింది. దాని నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ మొసలి పట్టంటే మాములుగా ఉండదు కదా. అందుకే తన బలంలో జీబ్రాను నీటి మధ్యలోకి లాక్కెళ్లింది. ఈ క్రూర మృగం నుంచి తప్పించుకోలేనన్న భావన జీబ్రా కళ్లల్లో కనిపించింది. వైల్డ్ లైఫ్ యానిమల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు విభన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘జీబ్రా మొసలి నుంచి తప్పించుకుని ఉంటే బాగుండేది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
TOP 9 ET News: దెబ్బకు దండం పెట్టిన సింగర్ సునీత | 1100 కోట్ల క్లబ్‌లోకి RRR
Bridgestone Tires: విస్తరిస్తున్న బ్రిడ్జ్‌స్టోన్ టైర్ల కంపెనీ.. హైదరాబాద్‌లో కొత్త స్టోర్..!