Bridgestone Tires: విస్తరిస్తున్న బ్రిడ్జ్‌స్టోన్ టైర్ల కంపెనీ.. హైదరాబాద్‌లో కొత్త స్టోర్..!
Bridgestone Tires: వ్యాపార, టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. కొత్త కొత్త ప్రాజెక్టులు వెలువడుతున్నాయి. కొత్త కొత్త కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. విదేశీయులు సైతం..
Updated on: Apr 23, 2022 | 8:59 PM

Bridgestone Tires: వ్యాపార, టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. కొత్త కొత్త ప్రాజెక్టులు వెలువడుతున్నాయి. కొత్త కొత్త కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. విదేశీయులు సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి కంపెనీలను స్థాపించేందుకు ముందుకొస్తున్నారు.

ఇక తాజాగా జపాన్‌కు చెందిన టైర్ల తయారీ సంస్థ బ్రిడ్డ్‌స్టోన్.. మరో ఆరు నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. హైదరాబాద్‌తోపాటు న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో కొత్తగా సెలెక్ట్+ స్టోర్‌లను ప్రారంభించింది.

జపాన్‌కు చెందిన బ్రిడ్జ్‌స్టోన్ గ్రూపు అనుబంధ సంస్థయైన బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా.. తన తొలి స్టోర్‌ను గతేడాది ఫిబ్రవరిలో పుణెలో ప్రారంభించింది.

ఈ స్టోర్లలో అన్ని రకాల టైర్లు, ఇందుకు సంబంధించిన సేవలు కూడా కంపెనీ అందిస్తోంది. టైరుకు సంబంధించిన సర్వీసులైన వీల్ అలైన్‌మెంట్, బాలెన్సింగ్, నైట్రోజెన్ ఫిల్లింగ్, రోటేషన్ వంటి సేవలు కూడా ఈ స్టోర్లలో పొందవచ్చును.




