Viral Video: జనారణ్యంలో మొసలి విహారయాత్ర.. భయంతో పరుగులు తీసిన గ్రామస్థులు.. షాకింగ్ వీడియో..
Crocodile Roaming on Village: సాధారణంగా మొసళ్లు నీటిలో, లేకపోతే నీటి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే.. కర్ణాటకలోని ఓ గ్రామానికి మొసలి విహారయాత్రకు
Crocodile Roaming on Village: సాధారణంగా మొసళ్లు నీటిలో, లేకపోతే నీటి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే.. కర్ణాటకలోని ఓ గ్రామానికి మొసలి విహారయాత్రకు వచ్చింది. అదేనండి.. గ్రామంలోకి దర్జాగా ప్రవేశించి ఊరు మొత్తం కలియతిరిగింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. పర్యాటక ప్రాంతమైన ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి కోగిలబానా గ్రామంలోకి గురువారం ఉదయం భారీ మొసలి ప్రవేశించింది. భారీ మొసలిని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వీధుల్లో మొసలి తీరుగుతున్న సమాచారాన్ని వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. ఆ తర్వాత వారొచ్చి మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో..
#WATCH Karnataka | A crocodile found strolling through Kogilban village in Dandeli. Later, forest officials rescued the crocodile & released it into the river. pic.twitter.com/2DDk7JuOB8
— ANI (@ANI) July 1, 2021
కాశీ నది నుంచి గ్రామంలోకి చేరుకున్న మొసలి సుమారు అరగంట పాటు వీధుల వెంట తిరిగిందని పేర్కొంటున్నారు. అయితే.. అదృష్టవశాత్తూ మొసలి ఎవరిపైనా దాడి చేయలేదని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. పర్యాటక ప్రదేశమైన దండేలిలో మొసలి పార్క్ కూడా ఉంది. ఈ నదిలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.