Telugu News Trending Crocodile fighting video was gone viral in social media Telugu viral News
Video Viral: వామ్మో ఇదేం ఫైటింగ్ రా బాబు.. భీకరంగా పోట్లాడుకున్న మొసళ్లు.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..
భూమిపై డైనోసార్‌లు, మముత్‌లు, సార్కోసుచస్ వంటి భారీ ప్రమాదకరమైన జీవులు మనుగడ సాగించిన విషయం తెలిసిందే. అయితే అవి ఇప్పుడు అంతరించిపోయాయి. కానీ నేటికీ వాటి అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మొసళ్లు...
భూమిపై డైనోసార్‌లు, మముత్‌లు, సార్కోసుచస్ వంటి భారీ ప్రమాదకరమైన జీవులు మనుగడ సాగించిన విషయం తెలిసిందే. అయితే అవి ఇప్పుడు అంతరించిపోయాయి. కానీ నేటికీ వాటి అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మొసళ్లు కూడా చాలా ప్రమాదకరమైనవి. నీటిలో ఉన్నప్పుడు అవి వేటాడే వేగం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. సోషల్ మీడియాలో మొసళ్లకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాటికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో రెండు మొసళ్లు నీళ్లలోంచి బయటకు వస్తాయి. అవి కోపంతో ఒకదానికొకటి పోట్లాడుకునేందుకు సిద్ధపడతాయి. నోరు పెద్దగా తెరిచి, తోకను గట్టిగా పట్టుకుంటాయి. వాటి మధ్య భీకర పోరు జరుగుతుంది. మొసళ్లు రెండూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ నీళ్లలోకి వెళ్లిపోతాయి. నీళ్లలోకి వెళ్లిపోయిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉందో తెలియనప్పటికీ.. అవి పోట్లాడుకున్న విధానం చూస్తుంటే మాత్రం తీవ్ర గాయాలయ్యాయనే విషయం మాత్రం తప్పక అర్థమవుతుంది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 22 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 66 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ ఏది గెలిచిందో తెలుసుకోవాలని ఉంది’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.