Viral Video: వార్నీ.. ఎవడ్రా నువ్వు భయంకర మొసలితో ఎకసెక్కాలు.. కట్ చేస్తే..
వైరల్ వీడియోలో నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలికి ఒక వ్యక్తి ఆహారం పెడుతున్నాడు. నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక వ్యక్తి మొసలిని చిన్న మాంసం ముక్కతో ప్రలోభపెడుతున్నాడు. అతను పదే పదే ఆహారాన్ని మొసలి నోటి వరకు తీసుకొచ్చి..ఆపై దాన్ని పైకి లాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల మొసలి చాలా కలవరపడుతుంది.. ఆవేశంలో ఆ మనిషి వైపు వేగంగా దూసుకొచ్చింది.

మొసళ్ళు చాలా ప్రమాదకరమైన క్రూరజంతువు. మొసలి చూడటానికే చాలా భయంకరంగా ఉంటుంది. పెద్ద దవడ.. పదునైన దంతాలు, ముళ్లలాంటి బాడీ… అన్నీ హడలెత్తిస్తాయి. మొసలికి చిక్కిన ఏ ప్రాణి బతికి బయటపడటం అసాధ్యమనే చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రతి నిత్యం వైరల్ అవుతున్న అనేక వీడియోల్లో మొసళ్లకు సంబంధించినవి కూడా చాలానే ఉంటున్నాయి. వీడియోల ద్వారా సెల్‌ఫోన్లు, టీవీల్లోనూ మొసలిని చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టుకోస్తుంది. అలాంటిది అదే మొసలి మీ ముందుకు వస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోండి. కానీ, ఇక్కడ ఒక వ్యక్తి భయంకరమైన మొసలికి ఆహారం పెడుతున్న వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మైక్రో-బ్లాగింగ్ సైట్ X లో షేర్ చేయబడిన ఈ వీడియోలో నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలికి ఒక వ్యక్తి ఆహారం పెడుతున్నట్లు చూపిస్తుంది. నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక వ్యక్తి మొసలిని చిన్న మాంసం ముక్కతో ప్రలోభపెడుతున్నాడు. అతను పదే పదే ఆహారాన్ని మొసలి నోటి వరకు తీసుకొచ్చి..ఆపై దాన్ని పైకి లాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల మొసలి చాలా కలవరపడుతుంది.. ఆవేశంలో ఆ మనిషి వైపు వేగంగా దూసుకొచ్చింది.
మొసలి దగ్గరకు రావడాన్ని చూసి ఆ వ్యక్తి మాంసం ముక్కను పైకి లేపుతూ వెనక్కి అడుగులు వేస్తున్నాడు.. మొసలి కూడా దానికి కావాల్సిన ఆహారం కోసం మరింత ముందుకు వస్తుంది..ఆగ్రహంతో అతనిపైకి ఎగరాలన్నంత కసితో అతడు వేస్తున్న ఎరను అందుకుంటుంది..దొరికిన ఆహారాన్ని తీసుకొని తిరిగి నీటిలోకి వెళ్లిపోతుంది. కానీ, ఆ వ్యక్తి మాత్రం మరోమారు అదే పని చేశాడు. చేతిలో ఆహారం పట్టుకుని మళ్లీ మొసలి కోపాన్ని చూసే ప్రయత్నం చేశాడు..కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.
వీడియో ఇక్కడ చూడండి..
Stupid guy feeds giant american crocodile 💀 pic.twitter.com/Eqnkueo9sQ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 8, 2025
వీడియోకు ప్రతిస్పందిస్తూ, ఒక వినియోగదారు ఇలా అన్నాడు, బహుశా అతను మొసలికి ఆహారంగా తనను తాను తినిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. ఎంత గొప్ప త్యాగం అంటూ ఎద్దేవా చేస్తూ రాశారు. మరొకరు స్పందిస్తూ.. ఇలాంటి తెలివితక్కువ పనులు ఎలా చేస్తారు.. ఇలాంటి వారికి బుర్రలో కాస్త మెదడును ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నారు. మరొకరు స్పందిస్తూ..అదృష్టవశాత్తూ అతని మొసలి దాడి చేయలేదని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..