Snake: మీ ఇంట్లోకి పాము వస్తే భయపడకండి.. ఈ చిట్కాలను పాటిస్తే సరి..! క్షణాల్లో పారిపోతుంది..
మనం పాములకు ఎంత భయపడతామో, అవి కూడా మనుషులకు అంతే భయపడతాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పాములు కొన్ని వాసనలకు చాలా భయపడతాయని చెబుతున్నారు. వాటి నుండి పాములు దూరంగా పారిపోతాయి. కాబట్టి, ఎప్పుడైనా అనుకోని విధంగా ఇంట్లోకి పాము ప్రవేశిస్తే దానిని చంపడానికి బదులుగా వెంటనే కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలని చెబుతున్నారు. దీంతో మీ ఇంట్లో దూరిన పాము.. దానంతట అదే అక్కడ్నుంచి పారిపోతుంది. అది ఎలాగంటే...

మన దేశంలో పాములను మతపరంగా పూజిస్తారు. నాగ పంచమి రోజున పాముకుపాలు పోసి పూజిస్తారు. కానీ, పాములంటే అంతే భయపడతారు కూడా. అంతదూరంలో పాము ఉందని తెలిస్తే.. చాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం పాములకు ఎంత భయపడతామో, అవి కూడా మనుషులకు అంతే భయపడతాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పాములు కొన్ని వాసనలకు చాలా భయపడతాయని చెబుతున్నారు. వాటి నుండి పాములు దూరంగా పారిపోతాయి. కాబట్టి, ఎప్పుడైనా అనుకోని విధంగా ఇంట్లోకి పాము ప్రవేశిస్తే దానిని చంపడానికి బదులుగా వెంటనే కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలని చెబుతున్నారు. దీంతో మీ ఇంట్లో దూరిన పాము.. దానంతట అదే అక్కడ్నుంచి పారిపోతుంది. అదేలాగంటే…
పాములు సాధారణంగా ఎవరికీ హాని చేయవు. కానీ వాటికి ప్రాణహని ఉందని తెలిస్తే మాత్రం తమను తాము రక్షించుకోవడానికి కాటు వేస్తాయి. ఈ కారణంగానే పాములు ప్రమాదకరమైనవి అంటారు. అయితే, పాములు కొన్ని వాసనలకు భయపడి అక్కడి నుండి వెంటనే పారిపోతాయని చెబుతున్నారు.
నిపుణుల సూచన మేరకు.. ఇంట్లోకి పాము వస్తే దాన్ని ఒంటరిగా వదిలేయాలని అంటున్నారు. అది దానంతట అదే నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎంత సేపటికీ పాములు దూరంగా వెళ్లకపోతే, వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
అదేవిధంగా, భూమిపై ఏ పాముకూ చెవులు ఉండవు. అయితే, పాములు పెద్ద శబ్దాలకు చాలా భయపడతాయి. వాటి శరీర నిర్మాణం అలాంటిది. పరిశోధన ప్రకారం, ఈ శరీర నిర్మాణం వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడం ద్వారా వాటికి మనుగడ సాగించడానికి సహాయపడుతుంది. కాబట్టి పాము అకస్మాత్తుగా దాని చుట్టూ పెద్ద శబ్దం వింటే, అది సురక్షితమైన ప్రదేశానికి పరిగెత్తడం ప్రారంభిస్తుంది.
పాములు బలమైన వాసనలకు కూడా చాలా భయపడతాయి. కాబట్టి ఇంట్లోకి పాము ప్రవేశిస్తే ఇంటి చుట్టూ ఫినాయిల్, వెనిగర్ లేదా కిరోసిన్ చల్లుకోండి. అదనంగా వెల్లుల్లి, నిమ్మకాయ, దాల్చిన చెక్క, పుదీనా వంటివి కూడా చల్లుకోవచ్చు. ఇలా చేస్తే కూడా పాములు పారిపోతాయి.
అలాగే, పాములు ఉష్ణోగ్రతలో మార్పులకు భయపడతాయి. పాములు కూడా పొగ నుండి దూరంగా పారిపోతాయని అంటారు. పాము ఇంట్లోకి ప్రవేశిస్తే, దానిని పొగతో కూడా తరిమికొట్టవచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..