ఓరీ దేవుడో.. అప్పుడే పుట్టిన ఆడశిశువును చూసి డాక్టర్లు షాక్..! అరుపులు, కేకలు వేస్తూ నర్సులు పరార్…
ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట, ఏదో ఒక వింత దృశ్యం, సరికొత్త సంఘటన, దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక బిడ్డ జననం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అప్పుడే పుట్టిన ఆ పసికందు అమ్మనాన్నలతో పాటు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు సైతం షాక్ అయ్యేలా చేసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చూసిన ప్రతి ఒక్కరూ అరుపులు, కేకలు వేస్తూ పారిపోయేలా చేసింది. ఇంతకీ ఆ శిశువు పరిస్థితి ఎలా ఉంది..? అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లా్ల్సిందే..

అమెరికాలోని అలబామాలో ఒక మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఆడ శిశువును ప్రసవించిన తల్లితో పాటుగా వైద్యులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, సదరు డాక్టర్ ఆసుపత్రి నుండి భయంతో కేకలు వేస్తూ పారిపోయింది. ఆ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ పేరు పమేలా మాన్, ఆమె బర్మింగ్‌హామ్‌లో నివసిస్తుంది. డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తుంది. మంగళవారం, ఆమె పారిస్ హలో అనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అలబామాలోని గ్రాండ్ వ్యూ మెడికల్ సెంటర్‌లో సిజేరియన్ ద్వారా ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
పమేలా మాన్ ఆడపిల్లకు జన్మనివ్వగా.. డెలివరీ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ నవజాత శిశువును చూసి ఆశ్చర్యపోయారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సైతం షాక్ అయ్యారు..ఓరీ దేవుడో అంటూ అందరూ నోరెళ్ల బెట్టారు.. ఇదంతా చూస్తున్న పమేలా మాన్‌కు అక్కడ జరిగిందో అర్థం కాలేదని చెప్పింది. కాబట్టి వారి మాటలు విని తాను కూడా షాక్ అయ్యానని పమేలా చెప్పింది. అయితే, అందరినీ అంతలా భయపెట్టి, కంగారుపెట్టిన విషయం ఏంంటే.. అప్పుడే పుట్టిన ఆడ శిశువు బరువు ఏకంగా 6 కిలోలు ఉండటం..
అవును.. ఆ అమ్మాయి సైజు చూసి అందరూ షాక్ అవుతారు? శిశువు బరువు సరిగ్గా 13 పౌండ్ల 4 ఔన్సులు. అంటే 6 కిలోల కంటే కొంచెం ఎక్కువగా ఉందట.. కానీ సాధారణంగా, పుట్టినప్పుడు ఆరోగ్యకరమైన శిశువు సగటు బరువు 7 పౌండ్లు (3.17 కిలోలు) కానీ, ఇక్కడ పుట్టిన బిడ్డ సాధారణం కంటే రెట్టింపు బరువుతో ఉంది.
బిడ్డ పుట్టడానికి నాలుగు వారాల ముందు, ఆమె బరువు 8 పౌండ్లు ఉందని డాక్టర్ చెప్పారు. కానీ ఆమె బరువు 10 పౌండ్లు ఉందని ఒక టెక్నీషియన్ చెప్పారని WVTM13 నివేదించింది. ఇద్దరు టెక్నీషియన్లు చెప్పిన దానికంటే శిశువు బరువు ఎక్కువగా ఉందని పమేలా చెప్పింది. ఆసుపత్రి నర్సులు కూడా తిరిగి వచ్చి ఈ భారీ బిడ్డను ఆశ్చర్యంతో చూశారని చెప్పింది. ఆమె కేవలం మూడు రోజుల వయసు మాత్రమే ఉంది. కానీ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అంటూ తల్లి పమేలా చెప్పింది.
కాగా, ఈ శిశువు నిర్ణీత తేదీకి 16 రోజుల ముందు జన్మించింది. ఈ నవజాత శిశువుకు ఇప్పటికే 6 నెలల శిశువుకు తగిన దుస్తులు ధరిస్తున్నారు. శిశువు అధిక బరువుతో ఉన్నప్పటికీ, ఈ పాప ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న చిన్నారుల లిస్ట్‌లో చేరలేదు..గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అత్యంత బరువైన శిశువు 1955లో ఇటలీలో జన్మించింది. ఆ శిశువు పుట్టినప్పుడు 22 పౌండ్ల (సుమారు 10 కిలోలు) బరువుతో పుట్టినట్టుగా వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..