AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చావును వెతుక్కుంటూ దగ్గరగా వెళ్లింది.. కేవలం 2 సెకన్లలోనే అంతా ఖతం..!

నీటి అడుగున మొసలి ముందు నిలబడటం ఎంతో ప్రమాదమో ఈ ఘటన రుజువు చేస్తోంది. సింహం కూడా మొసలి దారిలో జాగ్రత్తగా నడవడానికి కారణం ఇదే. కానీ తాజాగా ప్రజల ముందుకు వచ్చిన ఒక వీడియో ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. అందులో, ఒక కుక్క మొసలి ప్రాంతంలోకి వెళ్లి పొరపాటు చేసింది. దీని తర్వాత ఎవరూ ఊహించనిది జరిగింది.

Watch: చావును వెతుక్కుంటూ దగ్గరగా వెళ్లింది.. కేవలం 2 సెకన్లలోనే అంతా ఖతం..!
Crocodile Kill Dog
Balaraju Goud
|

Updated on: Mar 08, 2025 | 4:09 PM

Share

దూరం నుండి అడవి ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో, అంత ప్రమాదకరంగా ఉంటుంది. అడవిని దగ్గరగా తెలిసిన వారికి ఈ వాస్తవం బాగా తెలుసు. అందుకే ఈ వ్యక్తులు తీసిన వీడియోను ఇంటర్నెట్ ప్రపంచంలో షేర్ చేసినప్పుడు, అది ప్రజలకు చేరిన వెంటనే వైరల్ అవుతుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే..!

మొసలి నీటిలో అత్యంత ప్రమాదకరమైన ప్రెడేటర్ అని మనందరికీ తెలుసు. అవకాశం వచ్చినప్పుడు తన ఎరను చంపే వేటగాడు ఇతనే. ఇప్పుడు ఈ వీడియో చూడండి, అక్కడ ఒక కుక్క చెరువు ఒడ్డున సంతోషంగా నిలబడి ఉంది. కానీ దానికి ఏమి జరుగుతుందో తెలియదు. తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. ఈ సమయంలో ఉప్పునీటి రాజు బయటకు వచ్చి ఒక్కసారిగా దాన్ని ముగేశాడు.

వీడియోను ఇక్కడ చూడండి

వీడియోలో, ఒక నలుపు, తెలుపు రంగు కుక్క చెరువు వైపు పరిగెత్తి సంతోషంగా నిలబడి ఉంది. ఇంతలో, ఒక మొసలి నీటిలో నుండి బయటకు వచ్చి, కుక్కను పట్టుకుని నీటిలోకి తీసుకెళ్లిపోయింది. ఉప్పునీటి రాజు చేసే ఈ పని ఎంత త్వరగా పూర్తయిందంటే రెండు సెకన్లలోనే కుక్క ఉనికి పూర్తిగా కనుమరుగైపోయింది. అయితే, తరువాత మరొక కుక్క తన సహచరుడిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంది. కళ్ల ముందే మాయమైన కుక్క కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయింది.

ఈ వీడియోను సోషల్ మీడియా Xలో @TheBrutalNature అనే హ్యాండిల్ షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోను 5 లక్షలకు పైగా ప్రజలు చూశారు. దానిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి మొత్తం సంఘటనను వీడియో చేస్తూనే ఉన్నందుకు సిగ్గుపడాలని, అతను కోరుకుంటే ఆ కుక్క ప్రాణాన్ని సులభంగా కాపాడగలిగేవాడని ఒక యూజర్ రాశారు. మరొకరు, ‘నీటి లోపల మొసలి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో… దాన్ని మొదటిసారి చూసిన తర్వాత దీనిని గ్రహించాను’ అని రాశారు. వాస్తవానికి ఇక్కడ కుక్క ఉనికి కేవలం 2 సెకన్లలోనే ముగిసిపోయిందని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..