AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పొలానికి వెళ్లే రైతులకు చెరువు గట్టుపై ఏదో కనిపించింది.. అటు ఓ లుక్కేసి చూడగా

ఆధార్ అంటే ఇప్పుడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి అతి ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఏ పని జరగాలన్నా ముందు ఆధార్ ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్‌లు ఏ ఉపయోగం లేకుండా చెరువులో కనబడితే.. అది కూడా కుప్పలుతెప్పలుగా పారవేసి ఉండడంతో సంచలనం రేపింది.

Viral: పొలానికి వెళ్లే రైతులకు చెరువు గట్టుపై ఏదో కనిపించింది.. అటు ఓ లుక్కేసి చూడగా
Representative Image
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 06, 2025 | 12:13 PM

Share

తూర్పు బర్దమాన్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెరువు పక్కన వేల సంఖ్యలో ఆధార్ కార్డుల గుట్ట లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది. తూర్పు బర్దమాన్ జిల్లా పూర్వస్థలి-2 బ్లాక్‌లోని పీలా పంచాయతీ పరిధి లలిత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చెరువు పక్కన పెద్దమొత్తంలో ఆధార్ కార్డులు పడి ఉన్నాయన్న స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి నుంచి మొత్తం ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుని పూర్వస్థలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆపై పోలీసులు ఇంత పెద్దమొత్తంలో ఆధార్ కార్డులు ఎవరు పారవేశారో.. అసలు ఎందుకు పారవేశారో.. అవి అసలైనవా లేదా నకిలీవా అని తేల్చే పనిలో భాగంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా SIR ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఊహించని ఘటన వెలుగుచూడడం పెద్ద దుమారమే రేపుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. పోలీసులు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అవి నిజమైనవో నకిలీవో అనే విషయమై పూర్తి స్థాయి పరిశీలన జరుగుతోంది. దీనికి SIR ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఐడెంటిటీ కార్డులకు సంబంధించిన విషయం మాత్రమే అని తేల్చి చెప్పారు. మరోవైపు.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపన్ చటర్జీ మాట్లాడుతూ.. ఈ ఆధార్ కార్డులు ఖచ్చితంగా నకిలీవే అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు రూ.500 నుంచి 700 చెల్లించి నకిలీ ఆధార్ కార్డులు తయారయ్యేవి. ఇప్పుడు దానికి పూర్తిస్థాయి కట్టడి చర్యలు చేపడుతున్నారు.

అలాంటి అవకాశమే లేదు. ఎవరో పాత నకిలీ కార్డులను చెరువులో పడేసి ఉండవచ్చు. పోలీసులు ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డుల వ్యవహారంతో తూర్పు బర్దమాన్ జిల్లాలో అధికార, ప్రతిపక్ష ఆరోపణల నడుమ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందనే చెప్పొచ్చు.