AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా.. వరద సమస్యకు ఏఐ అద్భుత పరిష్కారం.. వీడియో చూస్తే అవాక్కే..

భారీ వర్షం పడిందంటే దేశంలోని అన్ని నగరాలు అస్తవ్యస్తమవుతాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనికి సంబంధించి అద్భుత ప్లాన్‌తో ఉన్న ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షపు నీటి సేకరణ వంటివి ఆచరణాత్మకంగా ఎలా చేయవచ్చో ఈ వీడియో వివరిస్తుంది.

Viral Video: వారెవ్వా.. వరద సమస్యకు ఏఐ అద్భుత పరిష్కారం.. వీడియో చూస్తే అవాక్కే..
Urban Flooding Solution Ai
Krishna S
|

Updated on: Jul 31, 2025 | 5:38 PM

Share

వర్షం పడితే పట్టణాలన్నీ ఆగమాగమవుతాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, రోడ్లపై నీరు నిలవడం, వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే హైదరాబాద్‌లో కురిసిన వర్షాల అల్లకల్లోం సృష్టించింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోని ముఖ్య పట్టణాల పరిస్థితి ఇదే. ఢిల్లీ, గురుగ్రామ్, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధమై.. ప్రజల తీవ్ర అవస్థలు పడ్డారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సమస్యలకు పరిష్కారమేంటీ..? అన్నది అందరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఏఐ ఓ అద్భుత పరిష్కారం చూపిస్తోంది.

వరద నీటి వ్యవస్థకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వరద నీరు రోడ్లపై నిలవకుండా ఏం చేయొచ్చో ఈ వీడియో లో ఉంది. వరద రహిత రోడ్లు, వీధుల కోసం స్మార్ట్ డ్రెయిన్‌లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, వాతావరణ పర్యవేక్షణతో కనెక్ట్‌ అయిన ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు ఉన్నాయి. ప్రత్యేక రెయిన్ కమాండ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, వర్షపు నీటి నిల్వ ట్రాకర్లతో కూడిన ఎకో బస్ స్టాప్‌లు, హౌసింగ్ సొసైటీలలో రూఫ్‌టాప్ వర్షపు నీటి సేకరణ వంటివి ఆచరణాత్మకంగా ఎలా చేయవచ్చో ఈ వీడియో వివరిస్తుంది.

‘‘భారత్ వరద నీటితో సమస్యలు ఎదుర్కొంటున్న వేళ.. ఏఐ విన్నూత్న నీటి నిల్వ వ్యవస్థను తెరమీదకు తెచ్చింది. అదనపు వర్షాన్ని వనరుగా మార్చడానికి పురాతన జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మిళితం చేసింది’’అనే ట్యాగ్ లైన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏఐ వీడియో అద్భుతంగా ఉందని.. ప్రభుత్వాలు ఇటువంటి వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇటువంటివి చేయకుండా ప్రభుత్వాలను ఎవరు ఆపుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..