ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన బిర్యానీ.. ఓపెన్ చేయగా బొద్దింకల దర్శనం..! బోరుమంటున్న బాధితులు..
హోటళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చికెన్ బిర్యానీలో ఎలుక, కప్ప, పురుగులు ఇలా నిత్యం కల్తీ ఆహారాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హోటల్ నుండి ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీలో బొద్దింక దర్శనం ఇచ్చింది. దీంతో ఆఫుడ్ తిన్న బాధితులు బోరుమంటున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

బిర్యానీ అంటే పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టం..అందుకే, ఎప్పుడు హోటల్‌కి వెళ్లినా దాదాపుగా అందరూ తినేది బిర్యానీనే. కానీ ఇటివల కొన్ని హోటళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చికెన్ బిర్యానీలో ఎలుక, కప్ప, పురుగులు ఇలా నిత్యం కల్తీ ఆహారాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హోటల్ నుండి ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీలో బొద్దింక దర్శనం ఇచ్చింది. దీంతో ఆఫుడ్ తిన్న బాధితులు బోరుమంటున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఖమ్మం వైరా రోడ్డులో ఉన్న ఒక రెస్టారెంట్ నుండి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మేడిశెట్టి కృష్ణ అనే కస్టమర్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు… జుమాటో ద్వారా స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న కృష్ణ కుటుంబ సభ్యులు బిర్యానీ వడ్డించుకుని తినేందుకు సిద్ధం అయ్యారు.కొంచం తిన్న తర్వాత మళ్ళీ వడ్డించుకునే సమయంలో బొద్దింక పురుగు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. బిర్యానీలో బొద్దింక వచ్చిన విషయాన్ని రెస్టారెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకురావడంతో తమ రెస్టారెంట్ చాలా ఉన్నతమైన కిచెన్ ఉందని పేర్కొన్నారు. అవసరం అయితే చెల్లించిన డబ్బు వెనక్కి వేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. కోణార్క్ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ పెడితే హోటల్ వైభవ్ ఇన్ నుంచి బిర్యానీ పార్సిల్ రావడం గమనార్హం.
వీడియో ఇక్కడ చూడండి…
బొద్దింక బిర్యానీ తిని అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యత వహిస్తారని బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బిర్యానీలో బొద్దింక పురుగు వచ్చిందని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా సరైన విధంగా స్పందించకుండా నిర్లక్ష్యం గా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




