viral video: చూశారా ఈ చిత్రం… పాము చూడండి ఏం చేస్తుందో..?
నెట్టింట రోజు రకరకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మీ ముందుకు ఓ ఫోటోను తీసుకొచ్చాం. ఇందులో ఓ సర్పం గోడపై పరమేశ్వరుడి ఫోటో గీస్తున్నట్లుగా ఉంది. అది అలా గీస్తూ ఉంటే.. చుట్టూ జనాలు ఆసక్తిగా గమనించడాన్ని అందులో చూడవచ్చు.

సర్పాల రాజు వాసుకిని.. శివుడుకి గొప్ప భక్తుడిగా పరిగణిస్తారు. అతను ఎల్లప్పుడూ శివయ్యతోనే ఉండాలని కోరుకునేవాడని నమ్ముతారు. వాసుకి భక్తికి సంతోషించిన శివుడు.. తన మెడలో ఆభరణంగా ధరించాడు. అందుకే ఎప్పుడైన శివాలయాల్లో పాములు కనిపిస్తే.. భక్తులు ఎంతో తన్మయత్వానికి లోనవుతారు. అయితే నెట్టింట ఓ ఆశ్చర్యకర ఫోటో వైరల్ అవుతుంది. అందులోని ఒక అద్భుతమైన దృశ్యం ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇందులో నాగరాజు స్వయంగా గోడపై శివుని చిత్రాన్ని గీస్తున్నట్లు ఫోటోలో ఉంది. గోడపై పాము గీస్తున్నట్లుగా ఉన్న శివుని ముఖం మీరు చూడవచ్చు. గోడపై శివుని చిత్రాన్ని గీసేందుకు పాము.. తన పడగను ఉపయోగిస్తున్నట్లుగా అందులో ఉంది. పాము అలా శివయ్య బొమ్మను గీస్తుండగా.. చూట్టూ జనం ఆసక్తిగా గమనించడాన్ని ఫోటోలో చూడవచ్చు.
నెటిజన్స్ ఈ ఫోటోపై తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇదో అద్భుతమని వర్ణిస్తున్నారు. కొంతమంది ఆ పాముకు ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారేమో అంటుండగా.. మరికొందరు ఇది ఎడిటెడ్ ఫోటో అని కొట్టి పారేస్తున్నారు. ఇంకొందరు ఇది ఏఐ జనరేటెడ్.. పాములు డ్రాయింగ్ వేయడం ఏంటి పిచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
