Viral video: బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు.. గాల్లో ఎగురుకుంటూ వచ్చిన హెలికాఫ్టర్..! ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్ గా ఉంటాయి. మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. ఊహించని సంఘటనలు ఏవీ జరిగిన ప్రజలు భయపడతారు. కొన్నిసార్లు వారు సరదాగా వెళ్లే ప్రదేశాల్లో దిగ్భ్రాంతికరమైన సంఘటనలకు సాక్ష్యాలుగా మారతుంటారు. అలాంటి ఉదాహరణ ఈ వీడియో. ఒక బీచ్‌లో సరదాగా గడుపుతున్న కొందరు పర్యాటకులు ఊహించని ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని సెకన్లలో జరిగిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయి చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇక్కడ బీచ్‌లో జరిగిన ఒక ప్రమాదం పర్యాటకులను, స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని సెకన్లలో జరిగిన ఈ దృశ్యం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 11, శనివారం రోజున కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌లో జరిగిన ఈ షాకింగ్ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. సముద్ర తీరాన్ని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులకు ఇది ప్రాణాంతక సంఘటనగా మారింది.. డిజిటల్ యుగంలో, ఈ దృశ్యం కొన్ని సెకన్లలో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, హెలికాప్టర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పాదచారుల వంతెనను ఢీకొట్టింది. హెలికాప్టర్‌లో కూర్చున్న అనేక మంది, ప్రయాణికులు గాయపడ్డారు.
వీడియోలో, హెలికాప్టర్ నెమ్మదిగా కిందకు దిగుతున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో బీచ్‌లో, చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ఓహ్ మే గాడ్! అని అరుస్తున్నారు. హెలికాప్టర్ కూలిపోయే ముందు దానిలోని కొన్ని భాగాలు విరిగిపోయినట్లు కూడా కనిపిస్తుంది. ప్రమాదం తర్వాత హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు, రోడ్డుపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడని తెలిసింది. గాయపడిన వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనపై ప్రజలు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయిందని ఈ ప్రమాదాన్ని నివారించలేమని కొందరు భయాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారి భద్రత కోసం కొందరు ప్రార్థించారు. మరికొందరు హెలికాప్టర్‌లో, రోడ్డుపై గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
A Bell 222 (think Airwolf) has crashed in Huntington Beach, California this afternoon. N222EX is well know to visit local car shows and charity events in SoCal.
You can see the tail rotor start to change directions in the video and a fast clockwise rotation starts meaning tail… pic.twitter.com/MgEtTI2OH4
— Thenewarea51 (@thenewarea51) October 11, 2025
హంటింగ్టన్ బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం తర్వాత హెలికాప్టర్‌లోని ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా తరలించారు. రోడ్డుపై ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చాలా గందరగోళాన్ని సృష్టించింది. పర్యాటకులు, స్థానికులు కూడా కదిలిపోయారు.
హెలికాప్టర్ కూలిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఇది ప్రజల్లో దిగ్భ్రాంతికరమైన చర్చకు దారితీసింది. ప్రమాదానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు. పోలీసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




