Viral Video: ఈ ఆవుకు తిక్క పుట్టిందా ఏంటి..? పాపం స్కూల్‌కి వెళ్తున్న చిన్నారిపై

మీ గల్లీలోకి ఆవుల మంద ఏదైనా వచ్చిందా!. లేక మీరు వెళ్తున్న దారిలో ఆవుల గుంపు ఉందా!. అయితే, జాగ్రత్త!. ఆవులే కదా! అవేం చేస్తాయిలే అని నిర్లక్ష్యంగా ఉన్నారో... ప్రాణాలే పోవచ్చు!. నమ్మలేకపోతున్నారా!. పిచ్చి కుక్కలు మీదపడి కరిచినట్టుగా చెలరేగిపోయి దాడి చేస్తుంటే విలవిల్లాడిపోయింది ఆ చిన్నారి. ఆవు స్వైరవిహారానికి ఆ చిన్నారి తల్లి కూడా బెదిరిపోయింది. అయితే, ఈ హృదయవిదారక దృశ్యాలు ఒకసారి చూడండి. నిజంగా ఓ గోవు ఇలా పాపపై అటాక్ చేయడం చూసి మీరు పక్కాగా ఆశ్చర్యపోతారు.

Viral Video: ఈ ఆవుకు తిక్క పుట్టిందా ఏంటి..? పాపం స్కూల్‌కి వెళ్తున్న చిన్నారిపై
Cow Attacks Girl
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 11, 2023 | 9:03 AM

మీరు చూస్తున్న దృశ్యాలు జల్లికట్టు కాదు, లేక ఏదో మారుమూల గ్రామంలో జరిగిందీ కాదు. ఇండియన్‌ టాప్‌ సిటీస్‌లో ఒకటైన చెన్నై మహానగరంలో జరిగిందీ దారుణ ఘటన. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకుని తమ మానాన తాము వెళ్తుంటే, ఒక్కసారిగా వెనక్కితిరిగిన ఓ ఆవు అత్యంత దారుణంగా ఎటాక్‌ చేసింది. కొమ్ములతో ఎత్తిపడేసి పిచ్చిపట్టినట్టుగా కుమ్మేసింది. ఒకవైపు కొమ్ములతో కుమ్మేస్తూనే… ఇంకోవైపు కాళ్లతో తొక్కేసింది. పిచ్చి కుక్కలు మీదపడి కరిచినట్టుగా చెలరేగిపోయి దాడి చేస్తుంటే విలవిల్లాడిపోయింది ఆ చిన్నారి. ఆవు స్వైరవిహారానికి ఆ చిన్నారి తల్లి కూడా బెదిరిపోయింది. ఆ పొగరుబోతు ఆవు నుంచి కూతుర్ని కాపాడుకోలేక భయంతో కేకలు వేసింది. తల్లి అరుపులు విని బయటికొచ్చిన స్థానికులు… ఆవు నుంచి బాలిక నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. రాళ్లేస్తూ బెదిరించినా అదరకుండా బెదరకుండా అత్యంత దారుణంగా కుమ్మేసింది ఆవు. సుమారు నిమిషన్నరపాటు బాలికపై ఎటాక్‌ చేసింది.

ధైర్యంచేసి అందరూ తరమడంతో చివరికి విడిచిపెట్టింది. అప్పటికే తీవ్ర గాయాలతో స్పృహకోల్పోయిన ఆయేషా, ప్రస్తుతం ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది. తల్లి ఫిర్యాదుతో ఆవు యజమాని వివేక్‌పై కేసు నమోదు చేశారు అరుంబాక్కం పోలీసులు. చెన్నై మహానగరంలో జరిగిన ఈ ఇన్సిడెంట్‌ తీవ్ర కలకలం రేపింది. రహదారులపై విచ్చలవిడిగా పశువులు స్వైరవిహారం చేయడంపై మండిపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి పశువులను వదలొద్దన్న ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు చెన్నైవాసులు. ఈ ఇన్సిడెంట్‌ తర్వాత పశువుల మందలు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు కార్పొరేషన్‌ అధికారులు.

మామలుగా సిటీ గల్లీల్లో తిరిగే ఆవులు చాలా మృధు స్వభావంతో ఉంటాయి. అవి గల్లీల్లో తిరుగుతూ ఎవరైనా ఏమైనా ఇస్తే తింటూ ఉంటాయి. లేదంటూ చెత్త కుండీలలో వేసిన వ్యర్థ పదార్థాలను తింటూ ఉంటాయి తప్ప  ఎవరికీ హాని చేయవు. కానీ ఈ ఆవును సదరు యజమాని పెంచుతున్నట్లుగా తెలిసింది. అతడు ఏమీ పట్టనట్లుగా రోడ్డు మీదకు వదిలేయడంతో ఈ దారుణం జరిగింది. కాబట్టి కుక్కలు నుంచే కాదు ఇప్పుడు ఆవుల నుంచి కూడా చిన్న పిల్లలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని స్పష్టమవుతుంది. కాగా పాపను ఆవు అటాక్ చేసిన వీడియో ప్రజంట్ నెట్టింట్ వైరల్ అవుతుంది. ‘బాబోయ్ గోమాత ఇలా చేసిందా. నేను నమ్మలేకపోతున్నాను’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఇంత అగ్రెసీవ్‌గా ఆవు దాడి చేయడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అని మరో యూజర్ పేర్కొన్నాడు.

ఆవు పాపపై దాడి చేస్తున్న వీడియోను దిగువన చూడండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..