AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బట్టల ఖరీదు చూసి కస్టమర్ ను అవమానించిన షాప్ సిబ్బంది.. అద్భుతమైన రీతితో ప్రతీకారం తీర్చుకున్న యువతి..

ఒక యువతి షాపింగ్ కోసం లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది హాజరు కాలేదు. దీంతో ఆ యువతి తనకు షాప్ లో అవమానం జరిగింది అని భావించింది. ఈ ఘటన గురించి సదరు లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదు. విసిగిపోయి ఓడిపోయిన ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

Viral News: బట్టల ఖరీదు చూసి కస్టమర్ ను అవమానించిన షాప్ సిబ్బంది.. అద్భుతమైన రీతితో ప్రతీకారం తీర్చుకున్న యువతి..
Viral NewsImage Credit source: Representative Image
Surya Kala
|

Updated on: Aug 29, 2024 | 7:18 PM

Share

నిజమైన వ్యాపారస్తుల నైజం ఏమిటంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కస్టమర్స్ కు తమ సర్వీస్ ను అందించడం.. అయితే కొంతమంది దుకాణదారులు మాత్రం ఎల్లప్పుడూ తన పెద్ద కస్టమర్‌లకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తారు. ఇక్కడ పెద్ద కస్టమర్‌లు అంటే ఎక్కువ బిల్లులు చేసే కస్టమర్‌లు. అయితే వాస్తవంగా కస్టమర్ వ్యాపారస్తులకు దేవుడు అనే సామెత ని పక్కన పెట్టమే అన్న మాట. దుకాణదారులు చిన్న కస్టమర్లతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. లేదా సరిగ్గా వారిని ట్రీట్ చేయరు. ఇలాంటి అవమానాన్ని చాలా మంది మౌనంగా సహిస్తారు. మరికొందరు మాత్రం తమకు జరిగిన అవమానానికి తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దుకాణదారుడి మీద ఒక కస్టమర్ అద్భుతమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది.

మనుషులకు కోపం, అసూయ చాలా సాధారణం అని మనందరికీ తెలుసు. కోపాన్ని జీర్ణించుకునే వ్యక్తులు కొందరు ఉన్నప్పటికీ, చాలా మంది తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్త కూడా అలాంటిదే.. ఒక యువతి షాపింగ్ కోసం లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది హాజరు కాలేదు. దీంతో ఆ యువతి తనకు షాప్ లో అవమానం జరిగింది అని భావించింది.

ఎలా పగ తీర్చుకుందంటే

ఇవి కూడా చదవండి

ఈ ఘటన గురించి సదరు లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదు. విసిగిపోయి ఓడిపోయిన ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అటువంటి పరిస్థితిలో ఆ యువతి తన ప్రతీకారం తీర్చుకోవడానికి రెండు నెలలు ఎదురు చూసింది. ఆమె 600,000 యువాన్లను (మనదేశ కరెన్సీలో సుమారు ₹ 70 లక్షలు) సేకరించింది. ఆ డబ్బులను తీసుకుని మళ్ళీ లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్ళింది. తాను షాపింగ్ చేస్తానని ఇంతలో నోట్లను లెక్కించమని సిబ్బందిని కోరింది. ఈ సమయంలో ఆమె అక్కడ షాపింగ్ చేయడం మొదలు పెట్టింది. డబ్బులు చిల్లరగా ఇవ్వడం అది కూడా పెద్ద అమౌంట్ కావడంతో ఆ సిబ్బందికి లెక్కించేందుకు రెండు గంటల సమయం పట్టింది.

ఇలా డబ్బులు లెక్కిస్తున్న సమయంలో ఆ యువతి షాప్ లోపల ఉన్న వస్తువులను చూడడం మొదలు పెట్టింది. ప్రతి వస్తువును జాగ్రత్తగా చూసింది. రకరకాల వస్తువులను ఎంచుకోవడం ప్రారంభించింది. ఇంతలో డబ్బులు లెక్కపెట్టడం ముగిసిన విషయం గమనించిన.. వెంటనే.. ఆ యువతి ఇప్పుడు నాకు షాపింగ్ చేయడం ఇష్టం లేదు. నేను వెళ్తున్నా.. మళ్ళీ వస్తా అంటూ తాను ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఓ రేంజ్ లో జనాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు చాలా మంది దీనిని టైట్ ఫర్ టాట్ అంటారని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..