AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం మానేసి పందుల పెంపకం మొదలుపెట్టిన యువతి.. ! కారణం ఇదేనట..

ఆమె ఒక టాప్ ఎయిర్‌లైన్ కంపెనీలో 5 సంవత్సరాలుగా ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. అయితే ఆ తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పందుల పెంపకం ప్రారంభించింది. అవును, ఆమె తన బంధువుల పొలంలో పందుల పెంపకం నిర్వహిస్తోంది. ఇందుకు ఆమె బలమైన కారణం చెబుతోంది. అంతేకాకుండా, ఆమె తన గ్రామ జీవితానికి సంబంధించిన వ్లాగ్‌లను కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఉంటుంది.

అందమైన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం మానేసి పందుల పెంపకం మొదలుపెట్టిన యువతి.. ! కారణం ఇదేనట..
Pig Farm
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2025 | 4:47 PM

Share

మనలో చాలామంది ఎక్కువ జీతంతో మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటారు. మంచి జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకుని వ్యవసాయం లేదా ఇతరత్రా సొంత వ్యాపారం చేసి విజయం సాధించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఓ యువతి కూడా అలాంటి పనినే ఎంచుకుంది. మంచి జీతంతో కూడిన ఉద్యోగం వదిలేసి ఎవరూ చేయని విధంగా పందుల పెంపకం చేపట్టింది. ఆ యువతి తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషకర సమయాన్ని గడపడానికి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు పందుల పెంపకం చేస్తుంది.. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

చైనాలోని షాంఘైకి చెందిన యాంగ్ యాంక్సీ అనే 27 ఏళ్ల యువతి పందుల పెంపకం కోసం ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదులుకుంది. ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఆమె ఒక టాప్ ఎయిర్‌లైన్ కంపెనీలో 5 సంవత్సరాలుగా ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. అయితే ఆ తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పందుల పెంపకం ప్రారంభించింది. అవును, ఆమె తన బంధువుల పొలంలో పందుల పెంపకం నిర్వహిస్తోంది. ఇందుకు ఆమె బలమైన కారణం చెబుతోంది. ఆమె తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషకర సమయాన్ని గడపడానికి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు పందుల పెంపకం నడుపుతోంది. అలాగే, ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెతో ఆనందంగా ఉంటున్నామని చెబుతున్నారు.

ఏప్రిల్ 2023లో యాంగ్ బంధువుల పొలంలో పందుల పెంపకాన్ని ప్రారంభించింది.. ఇప్పుడు ఆమె వాటికి ఆహారం తయారు చేసి అందిచడం, నుండి వాటికి కావాల్సిన ప్రతిదీ చేస్తోంది. అంతేకాకుండా, ఆమె తన గ్రామ జీవితానికి సంబంధించిన వ్లాగ్‌లను కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఉంటుంది. పందులు, ఇతర పశువులను సోషల్ మీడియా మార్కెట్లో విక్రయించడం ద్వారా గత రెండు నెలల్లో 2000,000 యువాన్లు ($27,000) సంపాదించినట్లు యాంగ్ పేర్కొన్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో పందుల పెంపకాన్ని విస్తరించడమే కాకుండా హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్