Viral Video: కదిలించిన ప్రేమ.. అలసిన తల్లి కోసం కొడుకు పడిన ఆరాటం.. వీడియో వైరల్..
చరిత్రకు అందని లోతైన బంధం అమ్మ-కొడుకులది. ఆ మాతృబంధం ఎంత గొప్పదో చెప్పే ఒక అద్భుతమైన, హృదయాన్ని కదిలించే దృశ్యం కోల్‌కతా మెట్రోలో కనపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలాది మందిని ఆకట్టుకుంటోంది. తల్లిపట్ల చిన్నారి చూపిన ప్రేమకు అంతా ఫిదా అవుతున్నారు.

రోజువారీ జీవితంలో మనం చూసే చిన్న చిన్న విషయాల్లోనే గొప్ప ప్రేమ దాగి ఉంటుంది. కోల్‌కతా మెట్రోలో రికార్డ్ అయిన అలాంటి ఒక హృదయాన్ని హత్తుకునే దృశ్యం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. పనితో అలసిపోయి నిద్రలోకి జారుకున్న ఒక తల్లికి, ఆమె కొడుకు చేసిన పని చూస్తే మీ కళ్లు చెమ్మగిల్లుతాయి. పని ఒత్తిడితో అలసిపోయి నిద్రిస్తున్న తల్లి పట్ల ఆ బుడోడు చూపించిన అపారమైన ప్రేమ, బాధ్యతను ఇది అద్భుతంగా ఆవిష్కరించింది.
రోజంతా పని చేసి అలసిపోయిన ఆ తల్లి మెట్రో ప్రయాణంలో నిద్రలోకి జారుకుంది. కానీ ఈ దృశ్యాన్ని వైరల్ చేసింది ఆ చిన్నారి అమాయకత్వం. నిద్రలో తల్లి తల పక్కకు వాలిపోతుండగా ఆమెను లేపకుండా, ఆ బుడ్డోడు తన చిట్టి చేతులతో ఆమె తలను సున్నితంగా పట్టుకున్నాడు. తన తల్లి పట్ల ఆ చిన్నారి చూపించిన అచంచలమైన ప్రేమ, నిస్వార్థమైన బాధ్యత ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది.
అందరినీ కదిలించిన ప్రేమ..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సైట్లలో వేల సంఖ్యలో షేర్ అవుతోంది. ఈ వీడియో తల్లికి పిల్లల మధ్య ఉన్న లోతైన బంధాన్ని, స్వచ్ఛమైన ప్రేమను మరోసారి చాటి చెబుతోంది. చిన్నారి చూపిన ప్రేమ.. మాటల కన్నా గొప్పగా.. అమ్మ-కొడుకుల బంధం ఎంత స్వచ్ఛమైందో ప్రపంచానికి చూపించింది. ప్రేమతో చేసే చిన్న పనులు కూడా ఎంత గొప్పగా ఉంటాయో ఈ సంఘటన నిరూపించింది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
