Watch: ఇదెక్కడి విడ్డూరం.. ఇంటి ముందుకు దూసుకొచ్చిన కార్గో షిప్.. షాకింగ్ వీడియో..
ఉదయం 5 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించటంతో తాను నిద్రలోంచి మేల్కొన్నానని చెప్పాడు. ఆ తర్వాత జోహన్ ఇంటి వైపు ఒక కార్గో షిప్ వెళుతున్నట్లు చూశానని చెప్పాడు. ఓడలోని షిఫ్ట్ వ్యవస్థను, వాచ్ కీపర్ విధిని కూడా పరిశీలిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కేరళ తీరంలో మునిగిపోయిన లైబీరియన్ కార్గో షిప్ గురించి ఆందోళనల మధ్య, నార్వే నుండి ఇలాంటి వింత వార్త వెలుగులోకి వచ్చింది.

విమాన ప్రయాణంలో పైలట్లు నిద్రమత్తుకు సంబంధించిన వార్తలు మనం ఇంతకు ముందు చాలా విన్నాం. కానీ, ఒక కెప్టెన్ నిద్రపోయాడనే వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే కెప్టెన్ నిద్రపోవడంతో ఓడ ఒక ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించింది. అది కూడా ఏదో చిన్నపాటి ఓడ కాదు, అది ఒక పెద్ద కార్గో షిప్. ఇంటి యజమాని నిద్రలో ఉండగా, భారీ శబ్దం విని బయటకు వచ్చేసరికి, తన ఇంటి ప్రాంగణంలో ఒక పెద్ద కార్గో షిప్ కనిపించింది. దాంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
నివేదికల ప్రకారం, నార్వే తీరంలో జోహన్ హెల్‌బర్గ్ చెక్క ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో 135 మీటర్ల పొడవున్న ఎన్‌సిఎల్ సాల్టెన్ అనే కార్గో షిప్ ఆగిపోయి కనిపించింది. వారం రోజుల పాటు కష్టపడి ఓడను తొలగించారు. ప్రమాదం జరిగిన సమయంలో NCL సాల్టెన్ రెండవ అధికారి, వాచ్ కీపర్, 30 ఏళ్ల ఉక్రేనియన్ వ్యక్తిని నార్వేజియన్ పోలీసులు అరెస్టు చేశారు. తాను ఒంటరిగా విధుల్లో ఉన్నానని, అలసటతో నిద్రపోయానని అతడు అంగీకరించినట్టుగా అధికారులు వివరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
Once was not enough.
Two GROUNDINGS in two consecutive years.
Back to back.
Grounding-1: 2024 on 13th April: North Sea Container Line vessel ‘NCL Salten’ IMO number 9252773 flying Cyprus flag with a 135m length built in 2002 ran aground in the port of Alesund. Owners declared… pic.twitter.com/D6qTw5lN3A
— Channel-16 (@singhalnaveens) May 23, 2025
ఇదిలా ఉంటే, తన ఇంటి ప్రాంగణం నుండి కార్గో షిప్ తొలగించబడిన తర్వాత జోహన్ హెల్బర్గ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ..హలో చెప్పడం బాగానే ఉంది. కానీ ఇప్పుడు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని హాస్యస్పదనంగా అన్నారు. అక్కడే ఉంటున్న మరో స్థానికుడు మాట్లాడుతూ..ఉదయం 5 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించటంతో తాను నిద్రలోంచి మేల్కొన్నానని చెప్పాడు. ఆ తర్వాత జోహన్ ఇంటి వైపు ఒక కార్గో షిప్ వెళుతున్నట్లు చూశానని చెప్పాడు. ఓడలోని షిఫ్ట్ వ్యవస్థను, వాచ్ కీపర్ విధిని కూడా పరిశీలిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కేరళ తీరంలో మునిగిపోయిన లైబీరియన్ కార్గో షిప్ గురించి ఆందోళనల మధ్య, నార్వే నుండి ఇలాంటి వింత వార్త వెలుగులోకి వచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




