Viral: చోరీకి వచ్చిన దొంగలు.. బ్యాంకు లోపల ఏం చేశారో తెలిస్తే బిత్తరపోతారు..
బ్యాంకులు కొల్లగొట్టడానికి వచ్చారు. ఎన్ని రోజులు నుంచి ప్రణాళిక వేసుకున్నారో, రెక్కీ చేశారో తెలియదు. ఫర్‌ఫెక్ట్‌గా బ్యాంకు లోపలికి చొరబడ్డారు. అయితే బ్యాంకు లోపలికి వెళ్లాక.. నగదు, నగలు కొల్లగొట్టడానికి ముందు ఈ దొంగలు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

కర్నాటక విజయపుర జిల్లా బసవన్ బాగేవాడి తాలూకా మనగూలి పట్టణంలోని కెనరా బ్యాంకులో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి, కిటికీ బార్లను కత్తిరించి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు తొలుత క్షుద్ర పూజలు చేశారు. తరువాత, వారు బ్యాంకులోని డబ్బు, నగలను దోచుకుని పరారయ్యారు. అంతేకాకుండా, బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల హార్డ్ డ్రైవ్‌ను కూడా తీసుకెళ్లిపోయారు. దొంగలు చోరీ చేయడం వరకు ఓకే కానీ ఇలా క్షుద్రపూజలం చేయడం చర్చనీయాంశంగా మారింది.
విషయం తెలిసిన వెంటనే మనగులి పోలీసులు, బ్యాంకు ఎండీ, సిబ్బంది సంఘటనా బ్యాంకుకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబార్గి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కెనరా బ్యాంక్ సిబ్బంది ఉన్నతాధికారులు సైతం అక్కడి వచ్చి జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. అయితే, ఎంత డబ్బు, నగలు మిస్ అయ్యాయి వివరాలపై ఇంకా క్లారిటీ రాలేదు.
బ్యాంకులోకి చొరబడిన దొంగలు సైరన్ మోగకుండా జాగ్తత్త పడ్డారు. పని ముగించుకుని వెళ్తూ.. సీసీటీవీ కెమెరాల హార్డ్ డ్రైవ్‌లను తీసుకున్నారు. కాగా మనగులి కీలక ప్రాంతాల్లో 35 సీసీటీవీ కెమెరాలను పుటేజ్‌ను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. జాతీయ రహదారి, ఇతర రహదారులపై ఉన్న కెమెరాల నుంచి కూడా డేటా సేకరిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగలు, నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తుల వస్తున్నాయి. అయితే, బ్యాంకు అధికారులు, పోలీసులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఖాతాదారులలో భయాందోళన నెలకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
