AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి కుమార్తెను వీడియో తీసి షాక్‌ అయిన కెమెరామెన్‌… పెళ్లి వేడుకలో నవ్వులే నవ్వులు

ఆధునిక కాలంలో పెళ్లి చేసుకోవడం అంటే సినిమా షూటింగ్‌ను తలపిస్తుంటుంది. వివాహం నిశ్చయ తాంబూలాల నుంచి పెళ్లి జరిగి కొత్త కోడలు అత్తారింటిలో అడుగు పెట్టే వరకు ప్రతిదీ ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డ్‌ చేస్తుంటారు. జీవితాంతం తీపి గుర్తుంగా ఉంచుకునే క్షణాలను పది కాలాల పాటు...

Viral Video: పెళ్లి కుమార్తెను వీడియో తీసి షాక్‌ అయిన కెమెరామెన్‌... పెళ్లి వేడుకలో నవ్వులే నవ్వులు
Cameraman Shock
K Sammaiah
|

Updated on: May 28, 2025 | 2:04 PM

Share

ఆధునిక కాలంలో పెళ్లి చేసుకోవడం అంటే సినిమా షూటింగ్‌ను తలపిస్తుంటుంది. వివాహం నిశ్చయ తాంబూలాల నుంచి పెళ్లి జరిగి కొత్త కోడలు అత్తారింటిలో అడుగు పెట్టే వరకు ప్రతిదీ ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డ్‌ చేస్తుంటారు. జీవితాంతం తీపి గుర్తుంగా ఉంచుకునే క్షణాలను పది కాలాల పాటు పదిల పర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఫొటో గ్రాఫర్లకు, కెమెరామెన్‌లో ఉండే మర్యాదనే వేరు. పెళ్లిలో వారిని అంతా ఓ స్పెషల్‌ గెస్ట్‌గా చూస్తుంటారు. లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక కెమెరామెన్స్‌ కూడా వారి ప్రతిభకు పదును పెడుతూ ఉంటారు.

ఫొటో షూట్స్ పేరుతో నూతన జంటను సినిమా తరహా స్టిల్స్ తీయడం, డాన్స్ చేయించడం, పెళ్లి మంటంపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వడం.. ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంతో అందంగా , వినూత్నంగా ఉండేలా డైరెక్షన్‌, స్క్రీన్‌ ప్లే చేసుకుంటూ మరి రికార్డ్‌ చేస్తుంటారు. మరి కొందరు కెమెరామెన్‌లు చిత్రవిచిత్రంగా వీడియోలు తీయడం కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ పెళ్లిలో సడన్‌గా జరిగిన హఠాత్పరిణామానికి అంతా నవ్వుకుంటున్నారు. అందంగా తయారైన పెళ్లి కూతురు పెళ్లి మంటపంలోకి అంతే అందంగా నడుచుకూంటూ వస్తుంది. ఆ సమయంలో ఆమె చుట్టూ నిలబడ్డ వారు రంగు రంగుల దుపట్టాను వధువుకు నీడగా పట్టుకుని వస్తుంటారు. ఆ సీన్‌ను కెమెరామెన్ తన టాలెంట్‌ను ఉపయోగించి, వినూత్నంగా వీడియో తీసేందుకు వెనక్కు నడుస్తూ ఉంటాడు.

అయితే అంతా బాగానే ఉందనకుంటున్న సమయంలో సడెన్‌గా ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. షూటింగ్‌లో లీనమైపోయిన కెమెరామెన్‌ అలా వెనక్కు వెళుతూ వీడియో తీస్తుండగా.. కాళ్లకు చెత్త డబ్బా తగులుకుని పెద్ద సౌండ్‌తో కిందపడిపోయాడు. ఈ ఘటనతో పెళ్లి కూతురుతో పాటు ఆమె స్నేహితులు, బంధువులంతా అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకుని పగలబడి నవ్వుకున్నారు. వీడియో గ్రాఫర్‌నే అక్కడున్నవారు వీడియో తీయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి:

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్