Telugu News Trending Car wash away in Flood water video was gone viral in social media Telugu Viral News
Video Viral: ప్లీజ్ ఫ్రెండ్స్.. ఇలాంటి సాహసాలు అస్సలు చేయకండి.. లేకుంటే ఇలాంటివి తప్పవు
వర్షాకాలంలో (Raining) వాగులు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటాయి. వానలతో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. రోడ్లు జలమయమవుతాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. చాలా చోట్ల వరదల కారణంగా వంతెనలు...
వర్షాకాలంలో (Raining) వాగులు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటాయి. వానలతో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. రోడ్లు జలమయమవుతాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. చాలా చోట్ల వరదల కారణంగా వంతెనలు కూడా పూర్తిగా కొట్టుకుపోతాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నదిని దాటుతారు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో చాలానే ఉన్నాయి. అయితే ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో నదికి భారీగా వరద వస్తుంది. ఒడ్డున ఆగి ఉన్న రెండు కార్లు వంతెనను దాటడానికి ప్రయత్నిస్తాయి. అందులో ఒక కారు నదిని దాటేయగా.. మరో కారు బలమైన నీటి ప్రవాహం ఒత్తిడిని తట్టుకోలేక కొట్టుకుపోతుంది. ఈ ప్రమాదకర ఘటనలో కారు డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అందుకే ప్రమాదకరమైన ప్రదేశాల్లో రిస్క్ తీసుకోకూడదని అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోను వేలాది మంది లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూశాక రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదకర స్టంట్స్ చేయాల్సిన అవసరం ఏముందని, ఇది ప్రాణాలకే ముప్పు కలిగించే ప్రమాదకర సాహసం అని వ్యాఖ్యానిస్తున్నారు.