Video Viral: నాతోనే తమాషాలు.. కుక్క తలపై గుడ్లు పగలగొట్టిన యజమాని.. చివరకి ఏం జరిగిందంటే
సకల సమాచారానికి సోషల్ మీడియా (Social Media) ఓ ప్లాట్ ఫామ్ గా మారిపోయింది. ఇక్కడ నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Videos) పోస్ట్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు, కుకింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, ఫైటింగ్, ప్లేయింగ్, పెట్స్ కు సంబంధించిన వీడియోలు...
సకల సమాచారానికి సోషల్ మీడియా (Social Media) ఓ ప్లాట్ ఫామ్ గా మారిపోయింది. ఇక్కడ నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Videos) పోస్ట్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు, కుకింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, ఫైటింగ్, ప్లేయింగ్, పెట్స్ కు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా ఉంటాయి. రకరకాల వీడియోలతో సోషల్ మీడియా నిత్యం కళకళలాడుతుంది. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. అందులో నెట్ కూడా ఉంది. దీంతో సామాజిక మాధ్యమాలను ఉపయోగించే వారికి కొదవ లేదు. తమ ట్యాలెంట్ ను చూపించుకోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది సోషల్ మీడియా. ఇన్ని రకాల వీడియోలు డంప్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి. అవి కొన్ని సందర్భాల్లో వైరల్ గా మారతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జంతువుల గురించి. జంతువులు చేసే ఏ పనైనా మనకు కొత్తగానే అనిపిస్తుంది. ్వి తమ వ్యవహారశైలికి వ్యతిరేకంగా చేసే ఏ పనులైనా వింతగానే అనిపిస్తాయి. అలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన పెట్ డాగ్ తో కలిసి ఉండటాన్ని చూడవచ్చు. ఆ వ్యక్తి గుడ్లను పగలగొట్టి సొనను గిన్నెలో వేస్తాడు. అయితే గుడ్లను పగలగొట్టేందుకు అతను స్పూన్ ను వాడలేదు. శునకం తలపై కొట్టి సొనను గిన్నెలో పోస్తున్నాడు. రెండు గుడ్లు పగలగొట్టేంతవరకు శాంతంగానే ఉన్న కుక్క.. మూడో గుడ్డు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తిరగబడింది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యూట్యూబ్ లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ ను విపరీతంగా చూస్తున్నారు. వేల సంఖ్యలో వ్యూస్ వస్తుండగా వందల మంది లైక్స్ చేస్తున్నారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని, కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని, పెట్స్ అయినా వాటితో ఆటలు వద్దని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..