Viral Video: పోట్లాడుకుంటే ఏమొస్తంది.. షేర్ చేసుకోవడంలోనే ఉంది అసలైన ఆనందం.. వీడియో వైరల్

మనకు చాలా ఇష్టమైన పనుల్లో ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం ఒకటి. పంచుకుంటూ తినడంలో వచ్చే మజానే వేరు. కానీ వాస్తవానికి చాలా తక్కువ మంది మాత్రమే ఆహారాన్ని పంచుకుంటారు. వివిధ కారణాల వల్ల ఇతరలు తమ ఆహారాన్ని ఇతరులకు ఇవ్వడమో లేక..

Viral Video: పోట్లాడుకుంటే ఏమొస్తంది.. షేర్ చేసుకోవడంలోనే ఉంది అసలైన ఆనందం.. వీడియో వైరల్
Cat Food Sharing
Follow us

|

Updated on: Aug 18, 2022 | 7:22 AM

మనకు చాలా ఇష్టమైన పనుల్లో ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం ఒకటి. పంచుకుంటూ తినడంలో వచ్చే మజానే వేరు. కానీ వాస్తవానికి చాలా తక్కువ మంది మాత్రమే ఆహారాన్ని పంచుకుంటారు. వివిధ కారణాల వల్ల ఇతరలు తమ ఆహారాన్ని ఇతరులకు ఇవ్వడమో లేక వారి ఆహారాన్ని తీసుకోవడం చేయరు. అయితే ఫుడ్ షేరింగ్ వల్ల ప్రేమ, అనుబంధం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలు మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తాయి. జంతువులు కూడా తమ ఆహారాన్ని పంచుకుని తింటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సాధారణంగా ఇంట్లో పెంచుకునే జంతువులు అంటే కుక్కలే గుర్తుకు వస్తాయి. కానీ శునకాల తర్వాత అధికంగా పెంచుకునే జంతువుల జాబితాలో పిల్లులు ఉంటాయి. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఒక గిన్నెలో ఉన్న ఆహారాన్ని రెండు పిల్లులు తింటున్నాయి. వాటి మధ్య బంధం చాలా బాగుంది. అవి పోట్లాడుకోకుండా గిన్నెను ఒకదానికొకటి మార్చుకుంటూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నాయి. మొదటి పిల్లి కాసేపు ఆహారం తిన్నాక రెండో పిల్లికి గిన్నె ఇచ్చింది. ఆ పిల్లి తిన్న తర్వాత గిన్నెను మళ్లీ మొదటి పిల్లికి ఇచ్చింది. ఇలా అవి రెండూ పరస్పరం మార్చుకుంటూ ఆహారాన్ని తినేశాయి.

ఈ అందమైన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు 31 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ పరుగుల జీవితంలో మనుషులు తమ నైతిక విలువల పట్ల అజాగ్రత్తగా ఉండి ఉండవచ్చు. కానీ ఈ వీడియోలోని జంతువులు మాత్రం ఆ లక్షణాలను కాపాడుకున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో చూశాక నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..