Two women married: ప్రేమగా మారిన ఇద్దరి మహిళల మధ్య స్నేహం.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ఆపై..
టెక్నాలజీ యుగంలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు..
టెక్నాలజీ యుగంలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. కాలానుగుణంగా సమాజం కూడా వాటిని అంగీకరిస్తుంది. మొన్నామధ్య.. ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు పెండ్లిమర్రి మండలం మిట్టమీద పల్లెకు చెందిన ఓ వ్యక్తితో ఏడాది క్రిందట వివాహం జరిగింది. అయితే వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ మహిళకు వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన తమ బంధువైన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆగస్టు 6వ తేదీన ఈ ఇద్దరు మహిళలూ చిత్తూరు జిల్లా కాళహస్తిలో వివాహం చేసుకున్నారు. అనంతరం వేంపల్లె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, విషయం చెప్పి, తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరారు. దాంతో సీఐ సీతారామిరెడ్డి మహిళలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, వారి వారి బంధువులను పిలిపించి వారికి అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

