Telugu News Trending Bull entered in bank video was gone viral in social media Telugu Viral News
Viral Video: బ్యాంకుకు వచ్చిన అనుకోని అతిథి.. పట్టుకునేందుకు వచ్చిన సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది.. చివరకు
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లో పెరిగితే మరికొన్ని అడవుల్లో నివసిస్తుంటాయి. వీటిలోనూ పెంపుడు జంతువుల, క్రూర జంతువులు అని రకాలు ఉంటాయి. పెంపుడు జంతువుల్లోనూ కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. వాటిలో...
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లో పెరిగితే మరికొన్ని అడవుల్లో నివసిస్తుంటాయి. వీటిలోనూ పెంపుడు జంతువుల, క్రూర జంతువులు అని రకాలు ఉంటాయి. పెంపుడు జంతువుల్లోనూ కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎద్దుల గురించి. బలంగా, దృఢంగా ఉండే ఎడ్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవి కొన్ని సార్లు మనల్ని గాయపరుస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అప్ లోడ్ అయ్యే కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి వాటిని చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చాలా ఆశ్చర్యంగానూ, భయాందోళన కలగించేలా ఉంది. ఈ క్లిప్ లో ఒక ఎద్దు అకస్మాత్తుగా బ్యాంకులోకి దూసుకొస్తుంది. ఎద్దును చూసిన బ్యాంకు సిబ్బంది భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. ఇజ్రాయెల్ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎద్దును పట్టుకోవడానికి సిబ్బంది చెమటోడ్చారు. అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అది వారి వల్ల కాలేదు. ఒక వ్యక్తి ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని ఎద్దు దగ్గరకు వెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.
ברגעים אלו בלוד: שור זועם נכנס למתחם הגדול של בנק לאומי, נוגח רכבים ומשתולל במסדרונות pic.twitter.com/RZpwI5quLb
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 18 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 90 వేలకు పైగా వ్యూస్, 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.