Bride Prank Video: వెడ్డింగ్ ఫోటో సూట్‌లో పెళ్లి కూతురి ఫ్రాంక్.. ఫోటోగ్రాఫర్‌కు దిమ్మతిరిగింది..
Bride Doing Prank: చాలా వివాహ వేడుకల్లో వేదికపై పెళ్లి జంట తర్వాత సెంటర్ పాయింట్‌గా ఫోటోగ్రాఫర్లు నిలుస్తున్నారు. వెడ్డింగ్ వేడుకలో ప్రతి అంశంను తమ కెమెరాల్లో బంధించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు.

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. వివాహ వేడుకల్లో జరిగిన సరదా దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ అవుతున్నాయి. వివాహానికి సంబంధించిన వివిధ రకాల వీడియోలు ఈ రోజుల్లో లీడ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి వీడియోలను చూసేందుకు జనం ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలను చూసినప్పుడు నవ్వులు పూయిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు భావోద్వేగంగా ఉంటాయి. మీ కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అయితే మనం ఈ రోజు వైరల్ అవుతున్న ఈ పెళ్లి వీడియోను చూస్తే మాత్రం పగలబడి నవ్వుతారు.
అయితే చాలా వివాహ వేడుకల్లో వేదికపై పెళ్లి జంట తర్వాత సెంటర్ పాయింట్‌గా ఫోటోగ్రాఫర్లు నిలుస్తున్నారు. వెడ్డింగ్ వేడుకలో ప్రతి అంశంను తమ కెమెరాల్లో బంధించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఇదిలావుంటే కొందరు ఫోటోగ్రాఫార్లు చేసే అతి మాములుగా ఉండదు. సినిమా డైరెక్షన్ తరహాలో బిల్డప్ ఇస్తుంటారు. వారు ఇచ్చే సలహాలు కొన్నిసార్లు కోపం.. నవ్వు తెప్పిస్తుంటాయి.
అయితే ఈ వీడియోలో కూడా ఫోటోగ్రాఫ్ చేసిన పని పెద్ద వైరల్ వీడియోగా మారింది. ఈ వీడియోలో వధూవరుల ఫోటోషూట్ జరుగుతున్నట్లు మనం చూడవచ్చు. దీని కోసం ఒక చిన్న కొలను మధ్యలోని ఉన్న వేదికపై వారు వెడ్డింగ్ ఫోటోలు దిగుతున్నారు. దానిపై వధువు తన భాగస్వామితో కలిసి అందమైన తెల్లని గౌనులో కనిపిస్తారు. ఫోటోగ్రాఫర్.. అతని బృందం వెనుక నిలబడి దంపతుల ఫోటోను క్లిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో వధువు వరులు ఎలా పోజు ఇవ్వాలో వివరించడానికి వస్తాడు ఫోటోగ్రాఫర్. కానీ ఫోటోగ్రాఫర్ వరుడి వద్దకు వెళ్లి ఈ భంగిమ అంటూ చెప్పందుకు ప్రయత్నిస్తుంటాడు. కొద్దిగా చిలిపిగా..కొంటెగాగా వధువు వారిద్దరినీ నీటిలోకి నెట్టేసింది.
View this post on Instagram
ఈ వీడియోను హెప్గుల్ 5 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ప్రజలు దీన్ని ఒకరితో ఒకరు పంచుకోవడమే కాదు.. దానిపై వివిధ రకాల కామెంట్స్.. రియాక్షన్స్ కూడా ఇస్తున్నాయి. ఈ ఫోటోషూట్ వీడియోను చూసిన తర్వాత మీరు కూడా నవ్వడం ఆపలేరు.
ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..
Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..