Viral: ‘ప్రేమ నిజంగా గుడ్డిది’.! మొబైల్ దొంగలించాడు.. కట్ చేస్తే.. చిన్నదాని మనసు దోచేసుకున్నాడు..

ప్రేమ ఎప్పుడు.. ఎలా.. పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. సరిగ్గా ఈ సామెతకు తగ్గట్టుగా బ్రెజిల్‌లో ఓ ప్రేమ చిగురించింది. దొంగతనానికి వచ్చిన దొంగపై మనసు పారేసుకుంది ఓ చిన్నది. అలాగే అతడు కూడా ఆమె అందానికి మైమరిచిపోవడంతో.. ఇప్పుడు వీరిద్దరి ప్రేమ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: 'ప్రేమ నిజంగా గుడ్డిది'.! మొబైల్ దొంగలించాడు.. కట్ చేస్తే.. చిన్నదాని మనసు దోచేసుకున్నాడు..
Bizzare Love Story
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2023 | 7:27 PM

ప్రేమ ఎప్పుడు.. ఎలా.. పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. సరిగ్గా ఈ సామెతకు తగ్గట్టుగా బ్రెజిల్‌లో ఓ ప్రేమ చిగురించింది. దొంగతనానికి వచ్చిన దొంగపై మనసు పారేసుకుంది ఓ చిన్నది. అలాగే అతడు కూడా ఆమె అందానికి మైమరిచిపోవడంతో.. ఇప్పుడు వీరిద్దరి ప్రేమ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బ్రెజిల్‌కు చెందిన ఇమాన్యులా అనే యువతి ప్రేమ గురించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డుపై నడుస్తుంటే.. ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ దొంగలించాడని, అతనితోనే ప్రేమలో పడినట్టు ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. ఆ దొంగ సైతం మొబైల్‌లో ఇమాన్యులాను చూసి మైమరిచిపోయానని, ఇంత అందాన్ని చూడలేదని చెప్పుకొచ్చాడు. నెటిజన్లు మాత్రం.. ప్రేమ నిజంగానే గుడ్డిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రెండేళ్ల కిందట బ్రెజిల్‌కు చెందిన ఇమాన్యులా అనే యువతి.. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ దొంగలించాడు. అనంతరం ఆమె ఫోన్‌లో సదరు యువతి ఫోటోలు, వీడియోలు చూసి.. మైమరిచిపోయాడు. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. వెంటనే ఆ చిన్నదానికి తన లవ్ కూడా ప్రపోజ్ చేశాడు. ఇక అమ్మడు కూడా ఆ సమయంలో ఏ మూడ్‌లో ఉందో గానీ దెబ్బకు ఓకే చెప్పేసింది. అప్పటినుంచి ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఆమె చుట్టుప్రక్కల వాళ్లు ఆ దొంగతో లవ్వేంటని తిట్టినా.. యువతి మాత్రం అవేం పట్టించుకోకుండా.. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక వీరి ప్రేమ కాస్తా.. ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో.. లవర్స్ ఇద్దరూ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?