AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓ మై గాడ్.. ఏంటక్కా పామును కట్టెపుల్లలా పట్టేశావ్.. చూస్తేనే గుండె ప్యాంటులోకి వచ్చేలా ఉంది..

సాధారణంగా పామును చూస్తే మనం భయంతో పరుగులు తీస్తాం.. కానీ.. ఆమె మాత్రం పాము వైపే వెళ్లిపోతుంది.. ఏమాత్రం భయం.. బెరుకు లేకుండా పాము దగ్గరికి వెళ్లి పట్టుకుంటుంది.. అది కూడా నవ్వుతూ.. ఏం చేయదులే భయ్యా .. భయమెందుకు నేనున్నాగా అంటూ బాధితులకు భరోసా ఇస్తూనే..

Viral Video: ఓ మై గాడ్.. ఏంటక్కా పామును కట్టెపుల్లలా పట్టేశావ్.. చూస్తేనే గుండె ప్యాంటులోకి వచ్చేలా ఉంది..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2024 | 8:15 PM

Share

సాధారణంగా పామును చూస్తే మనం భయంతో పరుగులు తీస్తాం.. కానీ.. ఆమె మాత్రం పాము వైపే వెళ్లిపోతుంది.. ఏమాత్రం భయం.. బెరుకు లేకుండా పాము దగ్గరికి వెళ్లి పట్టుకుంటుంది.. అది కూడా నవ్వుతూ.. ఏం చేయదులే భయ్యా .. భయమెందుకు నేనున్నాగా అంటూ బాధితులకు భరోసా ఇస్తూనే.. సరదాగా విషపూరితపాములను పట్టుకుంటుంది.. తాజాగా.. ఓ పాము కంప్యూటర్ రూంలోకి ప్రేవేశించగా.. పాములు పట్టే అజిత అనే యువతి అక్కడికి చేరుకుని పామును పట్టుకుని.. సంచిలో బంధించి తీసుకెళ్లింది..

వర్షాకాలంలో సరీసృపాలు తరచుగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అందుకే.. ఈ కాలంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తాజాగా ఓ పాము.. కంప్యూటర్ ల్యాబ్‌లోకి ప్రవేశించింది.. దానిని చూసిన విద్యార్థులు, టీచర్లు భయంతో వణికిపోయారు. అనంతరం పాము ల్యాబ్‌లోని కంప్యూటర్‌ వెనుక నక్కింది.. దీంతో వెంటనే పామును పట్టుకోవడానికి ఒక అమ్మాయిని పిలిచారు.. ఆ అమ్మాయి నవ్వుతూ అక్కడికి చేరుకుంది.. ఆమె ముఖంలో భయం జాడ కూడా కనిపించలేదు.. సరదాగా.. పిల్లలు ఆడుకునే వస్తువు మాదిరిగా పామును పట్టుకుంది.. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూడండి..

లాస్‌పూర్‌కు చెందిన యువతి.. అజిత స్నేక్ క్యాచర్.. Instagram ఖాతా @invincible._ajita లో అలాంటి అనేక వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. అందులో ఆమె పాములను పడుతూ కనిపిస్తుంది. అయితే మనం మాట్లాడుకుంటున్న వీడియో చాలా షాకింగ్ గా ఉంది. అక్కడ పామును చూసి అందరూ భయపడ్డారు. ఈ ప్రదేశం పాఠశాలో లేక కంప్యూటర్ సెంటర్ అనేది పూర్తిగా తెలియదు కానీ అక్కడ ఉన్న వారి భయాన్ని అజిత ధైర్యంగా పోగొట్టింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది చూశారు.. దీంతో పాటు పలు రకాలు కామెంట్లు చేస్తూ.. బ్రేవ్ గర్ల్ అంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం