Telugu News Trending Boy making JCB video was gone viral in social media Telugu Viral News
Video Viral: ఈ జేసీబీ యంత్రాన్ని మీరెన్నడూ చూసుండరు.. చిన్నారి టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే
కొత్తగా ఏ పని ప్రారంభించినా అది మనకు కష్టంగానే అనిపిస్తుంది. చేస్తున్న కొద్దీ తేలికవుతుంది. మళ్లీ మళ్లీ చేయడం వల్ల మరింత సులభమవుతుంది. ఏదైనా కొత్త వస్తువులు, పద్ధతులను కనుగొనేముందు ఆటంకాలు ఎదురవడం...
కొత్తగా ఏ పని ప్రారంభించినా అది మనకు కష్టంగానే అనిపిస్తుంది. చేస్తున్న కొద్దీ తేలికవుతుంది. మళ్లీ మళ్లీ చేయడం వల్ల మరింత సులభమవుతుంది. ఏదైనా కొత్త వస్తువులు, పద్ధతులను కనుగొనేముందు ఆటంకాలు ఎదురవడం సాధారణమే. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లగలిగితేనే విజయం సాధిస్తాం. అయితే కొంత మంది మాత్రం తమకు నచ్చిన పని ఎంత కష్టమైనా దానిని ఎంతో ఈజీగా చేసేస్తారు. మూస పద్ధతులు పాటించకుండా తమ స్వంత మార్గాల్లో ప్రయత్నిస్తారు. ఇలా చేసేందుకు చాలా తక్కువ ఖర్చు, పరికరాలతోనే పని పూర్తవుతుంటుంది. అలాంటి వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక బాలుడు జేసీబీని తయారు చేశాడు. అది కూడా చెక్కతో చేయడం విశేషం. అంతే కాకుండా నిజమైన జేసీబీ యంత్రంగా అది అటూ ఇటూ కదులుతూ చక్కగా మట్టి తవ్వేస్తోంది. బాలుడి ట్యాలెంట్ చూసిని నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఈ జేసీబీ యంత్రానికి రెండు హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. చేతులతో హ్యాండిల్స్ ను కదిలించినప్పుడు యంత్రం చక్కగా పని చేస్తుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 20 లక్షలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘బాలుడు నిజంగా అద్భుతమైన ప్రయత్నం చేశాడు.’ ‘ఈ పిల్లవాడి ఆవిష్కరణ నిజంగా అద్భుతంగా ఉంది’ అని అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.