Elephant attack: అర్ధరాత్రి రోడ్డుపై ఏనుగు బీభత్సం.. భయంతో వణికిపోయిన జనం.. ఎక్సక్లూసివ్ వీడియో..
అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. పట్టణాలు, నగరాలు, పంటపొలాలు, గ్రామాలు అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి...
అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. పట్టణాలు, నగరాలు, పంటపొలాలు, గ్రామాలు అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ ఏనుగు అర్థరాత్రి జనావాసాల్లోకి వచ్చి స్థానికులను ముప్పుతిప్పలు పెట్టింది. బాగుర్ అటవీ ప్రాంతంలోని గ్రామంలోకి వచ్చిన గజరాజు ఇళ్లపై దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామం నుంచి ఏనుగుని తరలించేందుకు శ్రమించాల్సి వచ్చింది. అడవుల నుంచి జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఈరోడ్ ప్రాంతమే కాకుండా సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోనూ గజరాజులు గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవుల నుంచి దారితప్పి సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వందల ఎకరాల పంటను ధ్వంసం చేస్తున్నాయి. వన్యప్రాణుల నుంచి తమను, తమ పంటలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos