Viral video: భార్యను బలవంతం మీద పారా గ్లైడింగ్ కు తీసుకెళ్లిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఇటీవల కాలంలో మనదేశంలో పారాగ్లైడింగ్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. చాలామంది సాహస యాత్రకు సై అంటున్నారు. కొందరు విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేస్తుంటే మరికొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల
ఇటీవల కాలంలో మనదేశంలో పారాగ్లైడింగ్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. చాలామంది సాహస యాత్రకు సై అంటున్నారు. కొందరు విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేస్తుంటే మరికొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల పారా గ్లైడింగ్ చేసిన కొందరు తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయిన ఘటనలను కూడా చూశాం. అయితే ఏ సాహసమైనా మన మనసుకు నచ్చితేనే చేయాలి. ఇతరుల మెప్పుకోసమో, బలవంతం మీద ఇలాంటి సాహసాలకు పూనుకుంటే మాత్రం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఒక భర్త తన భార్యకు ఇష్టం లేకపోయినా పారా గ్లైడింగ్ యాత్రకు తీసుకెళ్లిపోయాడు. అంతే.. పైకి వెళ్లగానే భయపడుతూ ఆ మహిళ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
నేను ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నానా?
కాగా యాత్ర ప్రారంభంలోనే తనకు చాలా భయంగా ఉంది.. తాను పారాగ్లైడింగ్ కు రాను అని మహిళ చెబుతుంది. కానీ భర్త ఆమెను బలవంతం మీద తీసుకెళతాడు. అంతే.. యాత్ర ప్రారంభంకాగానే సదరు మహిళ భయంతో చేతులతో కళ్లు మూసేసుకుంటుంది. బిగ్గరగా కేకలు వేస్తుంది. పాపం వారి వెంట వచ్చిన పారాగ్లైడింగ్ గైడ్ ఆమెకు ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తాడు. అయినా ఎలాంటి లాభం ఉండదు. పారాగ్లైడింగ్ పైకి వెళ్తున్నంత సేపు సదరు మహిళ ఇంకా భయపడుతుంది. తన చేతులు మొద్దు బారిపోతున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు గైడ్ ఆమెను సముదాయించి నవ్వించేందుకు జోక్ వేస్తాడు. అయినా ఆ మహిళ భయపడడం ఆపలేదు. కాగా తనకు ఇష్టం లేకున్నా పారాగ్లైడింగ్ యాత్రకు తీసుకొచ్చిన భర్తపై కోసం నషాలానికి అంటుకుంటుంది. ‘ దేవుడా.. నేను ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నానా?’ అంటూ తిడుతుంది. అంతేకాదు ‘ నిన్ను చంపేస్తాను’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భాగా వైరలవుతోంది. నెటిజన్లతో నవ్వులు పూయిస్తోంది. మరి మీరు కూడా ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేయండి..<
Pl beware when sending your wives on paraglide trips…j..truth comes out pic.twitter.com/RSoYRxmPaJ
— Maj Gen Sudhakar Jee, VSM (R) (@sudhakar_jee) January 17, 2022
Also Read: Covid Vaccine: గర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ సమయంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడు%