Viral: లుంగీలో వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్నారు.. ఆ తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యే సీన్

లంగీ కట్టుకుని వెళ్తే థియేటర్‌లో సినిమా చూడకూడదా..? ఎక్కడో బంగ్లాదేశ్‌ కాబట్టి సరిపోయింది కానీ మన దక్షిణాదిలో అయితే పరిస్థితులు ఇంకా వేరుగా ఉండేవి. వివరాల్లోకి వెళ్తే..

Viral: లుంగీలో వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్నారు.. ఆ తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యే సీన్
Viral News
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 4:13 PM

Trending: దక్షిణాదిలో ప్రజలు ఎక్కువగా లుంగీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో(Telugu states) పాటు తమిళనాడు(Tamil Nadu), కేరళ(Kerala) స్టేట్స్‌లో ఎక్కువగా లుంగీలు ధరిస్తారు. అర్బర్ ఏరియాలతో పోల్చుకుంటే.. రూరల్ ప్రాంతాల్లో లుంగీలు ధరించేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా పొలం పనులు చేసే రైతులు లుంగీలు కట్టుకుంటారు. లుంగీలు కట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పెద్దలు గరికపాటి లాంటి వాళ్లు కూడా చెబుతూనే ఉంటారు. కాగా తాజాగా ఓ వ్యక్తి మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లగా.. అతను లుంగీ ధరించాడని టికెట్ ఇవ్వనన్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో.. ప్రజలు భారీ ఎత్తున స్పందించారు. అదే థియేటర్‌కు లుంగీలు కట్టుకుని పెద్ద సంఖ్యలో వెళ్లారు. దీంతో థియేటర్ నిర్వాహకులు డిఫెన్స్‌లో పడ్డారు. తప్పు సరిదిద్దుకున్నారు. ఆ వ్యక్తికి ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అవకాశం కల్పించారు.  వివరాల్లోకి వెళ్తే..  ఆగస్లు 6వ తేదీన స్టార్ మల్టీప్లెక్స్ లో ‘పోరన్’ మూవీ చూసేందుకు మన్‌ అలీ సర్కార్‌ అనే పర్సన్ వెళ్లాడు. ఆ సమయంలో ఆయన లుంగీ ధరించి ఉన్నారు. దీంతో తనకు టికెట్ ఇవ్వనన్నారని అలీ సర్కార్ ఆరోపించారు. దీంతో వివాదం చెలరేగింది. తాజాగా ఈ వ్యవహారంలో థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఆ వ్యక్తి తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే కన్‌ఫ్యూజన్ ఏర్పడిందని తెలిపింది. వస్త్రధారణ విషయంలో తాము ఎలాంటి వివక్ష చూపమని పేర్కొంది. జరిగిన ఘటనపై చింతిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఈ క్రమంలో ఆ వ్యక్తిని కుటుంబంతో సహా ఆహ్వానించి.. సినిమా చూసేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ‘పోరన్’ మూవీ యాక్టర్స్‌లో ఒకరైన సరిఫుల్ రాజ్ వారితో కలిసి సినిమా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి