Telugu News Trending Watch Viral Video Man removes Shirt to Protect elderly lady from rain
Viral Video: చొక్కా విప్పి మరీ మానవత్వాన్ని చాటాడు..వీడియో చూస్తే మీరే శభాష్ అంటారు..
వర్షంలో వాకర్ సాయంతో నడుస్తున్న వృద్ధురాలిని చూడగానే ఓవ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు ఈవీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆవ్యక్తి ఏం చేశాడనుకుంటున్నారా..
Protect elderly lady: నేటి బిజీ షెడ్యూల్ లో ఎవరెలా పోతే మనకేంటి అనుకునే కాలంలోనూ మానవత్వాన్ని చాటే వారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికాలాంగులు, అంధులు రోడ్లు దాటేటప్పుడు చుట్టుపక్కలవారు సహకరించడం సాదారణంగా చూస్తుంటాం. కాని వర్షంలో వాకర్ సాయంతో నడుస్తున్న వృద్ధురాలిని చూడగానే ఓవ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు ఈవీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆవ్యక్తి ఏం చేశాడనుకుంటున్నారా.. ఒక వృద్ధురాలు వాకర్ సాయంతో కారు వద్దకు వెళ్లేందుకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇదే సమయంలో ఆప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఇది గమనించిన పక్కనే ఉన్న వ్యక్తి తన వీపు వైపు నుండి చొక్కా తీసి ఆ వృద్ధురాలిపై కప్పి..హ్యాండ్ బ్యాగ్ ను చేతితో పట్టుకుని..ఆమెతో పాటు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ కారు వద్దకు తీసుకెళ్లాడు. ఈవీడియోని గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేయడంతో ఇది వైరల్ అవుతోంది. ఆవీడియోపై ‘నన్ను క్షమించండి..నేను చూసిన అత్యంత అంతమైన ఘటనల్లో ఇదొకటి’ అంటూ రాసి ఉంది.
వృద్ధులపై సానుకూల ధృక్పదంతో ఉండటం ఎంతో గర్వంగా ఉంటుంది. రచయిత టియా వాకర్ చెప్పినట్లు ‘ఒకప్పుడు మనల్ని చూసుకున్న వారిని బాగా చూసుకోవడం అత్యున్నత గౌరవాల్లో ఒకటి అని చెప్పడానికి ఈదృశ్యం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈవీడియో చూసిన వారంత మానవత్వాన్ని చాటుకున్న వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడిని తల్లి సరిగ్గా పెంచిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే, నా కుమారుడిని అలాంటి మనిషిగా పెంచాలనుకుంటున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తం మీద ఈవీడియో మాత్రం అందరి మనస్సులను హత్తుకుంటోంది.