2026 ఎలా ఉండబోతుంది..? బంగారం నుంచి ఏలియన్స్ వరకు.. బాబా వంగా అంచనాలు ఏంటంటే?
రాబోయే 2026 సంవత్సరానికి సంబంధించి బాబా వంగా చేసిన అంచనాలు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. ఆమె అంచనాల ప్రకారం, 2026లో తీవ్రమైన భూకంపాలు, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు ఆధిపత్యం, గ్రహాంతరవాసులతో సంబంధాలు, ఆర్థిక సంక్షోభం, రష్యా నాయకుడి ఆవిర్భావం, చైనా బలోపేతం వంటి కీలక ప్రపంచ సంఘటనలు జరగవచ్చు.

మరో నెల రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ 2025 కాలగర్భంలో కలిసిపోనుంది. అయితే రానున్న 2026లో అంతా మంచే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది భవిష్యత్తును అంచనా వేసేవారు 2026లో ఏం జరగబోతుంది అని చెప్పారు. అలాంటి వారిలో బాబా వంగా గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆమె అంచనాలు చాలా వరకు నిజం అవుతుండటంతో ఆమె అంచనాలను నమ్మేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు నూతన ఏడాది రానున్న సమయంలో మరోసారి ఆమె అంచనాలపై చర్చ మొదలైంది. ఇంతకీ బాబా వంగా 2026 గురించి ఎలాంటి అంచనాలు వెల్లడించారో ఇప్పుడు తెలుసుకుందాం..
బాబా వంగా అంచనా ప్రకారం.. 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది మొత్తం ప్రపంచ భూభాగంలో గణనీయమైన భాగాన్ని (సుమారు 7-8 శాతం) ప్రభావితం చేస్తుంది. భూమిపై ఇటువంటి పెద్ద విపత్తులు సంభవిస్తూనే ఉన్నప్పటికీ, బాబా వంగా అంచనాలో పేర్కొన్న స్థాయి, నిర్దిష్ట సంఖ్యలు ధృవీకరించలేదు. బాబా వంగా చేసిన మరో అంచనా ప్రకారం.. 2026 నాటికి కృతిమ మేథస్సు కీలక నిర్ణయాలు, పరిశ్రమలు, మానవ జీవితాలను కూడా ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుత AI విజృంభణ చూస్తుంటే ఆమె చెప్పింది నిజమే అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు.
2026లో ముఖ్యంగా నవంబర్‌లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే పెద్ద అంతరిక్ష నౌక ద్వారా మానవులు గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారని వంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. అలాగే 2026లో రష్యా నుండి ప్రపంచ ప్రభువు లేదా ప్రపంచ వ్యవహారాల అధిపతి అని వర్ణించబడే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని సూచిస్తున్నాయి. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, బ్యాంకు వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవిస్తుందని అంచనా వేశారు. అలాగే 2026లో బంగారం ధరలు ఊహించని విధంగా మారవచ్చని బాబా వంగా అంచనా వేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2026 సంవత్సరం చైనా ప్రధాన ఆధిపత్యాన్ని పొందుతుందని బాబా వంగా అంచనా వేసినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో తైవాన్‌పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉంటాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
