అతనో పిచ్చోడు.. పెళ్లిపీటల మీద వరుడిని తిట్టిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వివాహం రద్దైంది. పెళ్లి ఊరేగింపు ఆలస్యంగా వచ్చిందని, బంధువులు తాగి ఉన్నారని, వరుడు పదే పదే వేడి నీళ్లు అడిగాడని వధువు ఆరోపించింది. వరుడిని పిచ్చివాడు అనడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆగ్రహించింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక పెళ్లి మండపంలో పెద్ద గందరగోళం జరిగింది. సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరగాల్సిన వివాహం.. వధువు ఆరోపణల కారణంగా ఆగిపోయింది. దీనితో వధువు లేకుండానే పెళ్లి ఊరేగింపు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. వరుడు లక్నోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వివాహ ఆచారాలైన దండలు మార్చుకోవడం, వివాహ ప్రమాణాలు వేడుకలకు ముందే ఈ కలకలం చెలరేగింది.
వధువు ఆరోపణలు ఇవే
పెళ్లి కూతురు వరుడిపై అతని బంధువులపై కొన్ని ముఖ్యమైన ఆరోపణలు చేసింది. పెళ్లి ఊరేగింపు ఆలస్యంగా వచ్చిందని, అలాగే బంధువులు కొంతమంది తాగి ఉన్నారని వధువు ఆరోపించింది. వరుడు పదే పదే వేడి నీళ్లు అడుగుతున్నాడని చెప్పి, అతడు పిచ్చివాడని వధువు అనడంతో గొడవ పెద్దదైంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తమ కొడుకుని పిచ్చివాడు అని పిలవడంతో వరుడి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వివాహ బృందంలోని కొంతమంది సభ్యులు అప్పటికప్పుడే వేదికను వదిలి వెళ్లిపోయారు.
పోలీసుల జోక్యం
పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇరువర్గాల వారితో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు. వివాహానికి సంబంధించిన వస్తువులు, ఖర్చు చేసిన నగదును తిరిగి ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలపై రెండు వర్గాలు రాజీ పడ్డాయి. ‘‘రెండు వర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఈ విషయంలో ఎవరూ ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదు’’ అని సర్వేంద్ర కుమార్ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
