Watch: హైదరాబాద్‌కు కదిలి వచ్చిన అయోధ్య రామమందిరం..! ఆసక్తిగా తిలకించిన భక్తులు, స్థానికులు..

500 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. అయితే .. సర్వాంగ సుందరంగా అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని ప్రతి హిందువు ఉద్వేగంతో చూస్తుండిపోతాడు. మరి అదే నిర్మాణ శైలిలో ఉన్న కారు రోడ్ల మీద పరుగులు పెడుతుంటే ఎవరైనా ముచ్చట పడకుండా ఉండగలరా? అయోధ్య రామ మందిరం ఏంటి.. కారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజం.. అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టినప్పటికీ ఇది అక్షరాలా నిజం.. శ్రీరామ నవమి సందర్భంగా ఆ కారు కథా కమామీషు తెలుసుకుందాం పదండి.

Watch: హైదరాబాద్‌కు కదిలి వచ్చిన అయోధ్య రామమందిరం..! ఆసక్తిగా తిలకించిన భక్తులు, స్థానికులు..
Ayodhya Ram Mandir Car

Edited By: TV9 Telugu

Updated on: Apr 07, 2025 | 3:52 PM

శ్రీరామ నవమికి ముందు రోజు హైదరాబాద్ రోడ్లపై అయోధ్య రామ మందిరం కార్లు పరుగులు పెట్టాయి. హైదరాబాద్‌లో సుధా కార్ల మ్యూజియం యజమాని అయిన హైదరాబాదీ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్, రోజువారీ వస్తువులను పోలి ఉండే ప్రత్యేకమైన ‘వాకీ కార్ మ్యూజియం’ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉన్న కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే.. గతేడాది డిజైనర్ సుధాకర్ యాదవ్.. ఈ అయోధ్య రామమందిర కారును తయారు చేశారు. ఈ కారు తయారై రోడ్ల మీద పరుగులు పెడుతుంటే ప్రజల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. చూసినవాళ్ళంతా రామ మందిరాన్ని పోలిన రీతికి ఇలా కారును తయారుచేయాలని ఆలోచన వచ్చినందుకు డిజైనర్ ను ప్రత్యేకంగా అభినందించారు. హిందువుల గుండె చప్పుడు అయిన రామ మందిర నిర్మాణంలో ఇలా వినూత్నంగా చేసిన ప్రయత్నానికి హర్షం వ్యక్తం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కారు డెకరేషన్ సంస్థ అయోధ్య రామమందిరం ఆకారంలో రూపొందించిన కారు అందరినీ ఆకట్టుకుంటోంది. బహదూర్ పురా సధాకార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ తీర్చి దిద్దిన ఈ కారు అయోధ్య రామాలయ నమూనాను పోలి ఉండటంతో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గత సంవత్సరంమే ఈ అయోధ్య రామమందిరా కారును తయారు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

22 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ వాహనం కదులుతుంటే అయోధ్య ఆలయం కదిలినట్లుగా కనిపిస్తుంది. అప్పట్లో ఈ వాహనం తయారీలో 10 మంది ముస్లిం కార్మికులు కూడా పాల్గొన్నట్టు సుధాకర్ యాదవ్ వెల్లడించారు.

సుధా కార్ల మ్యూజియం ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా చేతితో తయారుచేసిన ఏకైక కారు మ్యూజియం ఇదే కావడం విశేషం. రామ మందిర నిర్మాణ ఆకృతుల్లో ఉన్న కార్లు రోడ్లపై పరిగెడుతుంటే చూడడానికే కన్నులపండుగగా ఉందని ఎంతో మంది కొనియాడారు. కారును తీర్చిదిద్దిన తీరు, ఆ కట్టడ శైలి అంతా చక్కగా ఉందని పలువురు మెచ్చుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..