Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Navami 2025: శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు

ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. మరోవైపు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో భక్తులందరూ తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం దక్కనుంది. మరోవైపు అయోధ్య అంతట ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అందంగా ముస్తాబు చేశారు అక్కడి అధికారులు.

Ram Navami 2025: శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
Ayodhya Ram Mandir Surya Tilak
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Apr 07, 2025 | 3:52 PM

లోక రక్షణ, రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో జన్మించాడని చెబుతారు. అలా త్రేతాయుగంలో మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడు నవమి తిథి రోజున సూర్యవంశంలో జన్మించాడు. సూర్యుడు తన పూర్తి ప్రభావంలో ఉన్న మధ్యయుగంలో అభిజిత్ ముహుర్తంలో రామయ్య జననం జరిగిందని చెబుతారు. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని,14 ఏళ్ల అరణ్యవాసం అనంరతం పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెబుతారు. అందుకే ఏటా శ్రీరామనవమి రోజు ప్రపంచ వ్యాప్తంగా పండుగ, పర్వదినంగా జరుపుకుంటారు రామ భక్తులు. ఈ యేడు ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఆలయాల్లో శ్రీ సీతారముల కల్యాణం నిర్వహిస్తున్నారు.

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య.. శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉదయం తెల్లవారుజామునుంచే ఆలయంలోని బాలరామయ్యకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు.. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దుతారు. ఈ సందర్భంగా సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదిటిపై పడనున్నాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. మరోవైపు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో భక్తులందరూ తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం దక్కనుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు పోటెత్తారు. రాముడి ఆలయానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో సరయు నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అందంగా ముస్తాబు చేశారు అక్కడి అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది