AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్యయ్యో ఇదెక్కడి చోద్యం.. ఎగరకుండానే కుప్పకూలిన రాకెట్.. హ్యాపీగా ఉందన్న సీఈవో..!

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 మీటర్ల పొడవున్న రాకెట్ ప్రయోగించిన వెంటనే పైకి లేచి కింద పడుతుండటం వీడియోలో స్పష్టంగా  చూపిస్తుంది. రాకెట్ పడిపోయిన వెంటనే దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి. కాగా, ఈ ప్రయోగం విజయవంతమైందని కంపెనీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.

Watch: అయ్యయ్యో ఇదెక్కడి చోద్యం.. ఎగరకుండానే కుప్పకూలిన రాకెట్.. హ్యాపీగా ఉందన్న సీఈవో..!
Australia Rocket Launch Fails
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2025 | 1:46 PM

Share

ఆస్ట్రేలియాలో నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ చేసిన 14 సెకన్లలోనే కుప్పకూలింది. బుధవారం నాడు 14 సెకన్ల పాటు ఎగిరిన తర్వాత కూలిపోయింది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ ప్రయోగించిన ఏరిస్ రాకెట్ ఆస్ట్రేలియా రూపొందించి, నిర్మించిన మొదటి కక్ష్య ప్రయోగ వాహనం. 23 మీటర్ల ఎరిస్ లాంఛ్ వెహికల్ లిఫ్ట్ ఆఫ్ సమయంలో ఎగరలేక నేలపై కూలిపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో కాలిపోయింది. నార్తర్న్ క్వీన్స్‌లాండ్లోని బోవెన్ స్పేస్ పోర్ట్ నుంచి దీన్ని ప్రయోగించారు.

క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ సమీపంలోని అంతరిక్ష కేంద్రం నుండి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం దీనిని ప్రయోగించారు. ఈ రాకెట్ 75 అడుగుల పొడవు ఉండి, చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేలా రూపొందించబడింది. తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రాకెట్ తయారు చేయగా.. రాకెట్ తయారీ సంస్థ ‘గిల్మౌర్’ సీఈవో ఈ ప్రయోగాన్ని మైల్‌స్టోన్‌గా అభివర్ణిస్తూ, ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఈ ప్రయోగం విజయవంతమైందని కంపెనీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. నాలుగు హైబ్రిడ్-ప్రొపెల్డ్ ఇంజిన్‌లు మండించాయని, తొలి విమానంలో 23 సెకన్ల ఇంజిన్ బర్న్ సమయం, 14 సెకన్ల ఫ్లైట్ ఉన్నాయని పేర్కొంది. లాంచ్‌ప్యాడ్ నుండి రాకెట్ టేకాఫ్ చేయగలిగినందుకు తాను సంతోషంగా ఉన్నానని CEO ఆడమ్ గిల్మర్ అన్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 మీటర్ల పొడవున్న రాకెట్ ప్రయోగించిన వెంటనే పైకి లేచి కింద పడుతుండటం వీడియోలో స్పష్టంగా  చూపిస్తుంది. రాకెట్ పడిపోయిన వెంటనే దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి.

వీడియో ఇక్కడ చూడండి..

గతంలో ప్రయోగ తేదీని మే, జూలై ప్రారంభంలో నిర్ణయించారు. కానీ సాంకేతిక సమస్యలు మరియు ప్రతికూల వాతావరణం కారణంగా, కంపెనీ ప్రయోగాన్ని వాయిదా వేసింది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్‌గా నిధులు సమకూరుస్తుందని మరియు ఇటీవల ప్రభుత్వం నుండి గ్రాంట్ పొందిందని మీకు తెలియజేద్దాం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…