Amitabh Bachchan: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తో్న్న ఈ గేమ్ షోకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రేక్షుకుల విశేష ఆదరణతో ఇప్పటికే 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుందీ రియాలిటీ షో. త్వరలోనే ఈ ప్రోగ్రాం 14వ సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియో ఇటీవలే విడుదలైంది. సోషల్ మీడియా సైట్లలో ఉండే నకిలీ సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో రూపొందించిన ఈ 50 సెకెన్ల ప్రొమో వీడియోకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
టీవీల్లో చూసే తెలుసుకున్నా..
కాగా ఈ వీడియోలో హోస్ట్ బిగ్ బి తన ఎదుట కూర్చున్న కంటెస్టెంట్‌ను ఒక ప్రశ్న అడుగుతారు. ‘వీటిల్లో ఏది జీపీఎస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది’ అని క్వొశ్చన్‌కు గాను టైప్ రైటర్, టెలివిజన్, శాటిలైట్, రూ. 2000 నోటు అనే ఆప్షన్లు ఇస్తారు. దీనికి సమాధానంగా కంటెస్టెంట్ చిరునవ్వుతో రూ. 2వేల నోటు అని సమాధానం చెబుతుంది. ‘కచ్చితంగా అదే సమాధానమా?’ అని అమితాబ్ అడగ్గా.. ‘అవును సార్.. ఇది నాకే కాదు..యావత్ దేశానికి తెలుసు’ అని ధీమాగా చెబుతుంది. అనంతరం బచ్చన్ జీ ఆ సమాధానం తప్పు అని, శాటిలైట్ కరెక్ట్ ఆన్సర్ అని చెబుతాడు. వెంటనే ఆ మహిలా కంటెస్టెంట్ ‘సార్ మీరు జోక్ చేయట్లేదుగదా’ అని అనగా.. ‘నేనెందుకు జోక్ చేస్తాను.. జోక్‌ను మీరు నిజమని నమ్మారు’ అని బిగ్ బి రిప్లై ఇస్తారు. జీపీఎస్ చిప్ ఉన్న రెండు వేల రూపాయల నోట్ల వార్తలు టీవీల్లో, సోషల్ మీడియాల్లో వచ్చాయని, అలా తనకు తెలిసిందని ఆమె చెబుతుంది. టీవీలు, సోషల్‌మీడియాలో వచ్చే వార్తలను ఫ్యాక్ట్ చెక్ చేయకుండా నమ్మోద్దని, అలా నమ్మడం వల్లే తన కంటెస్టెంట్ గేమ్ ఓడిపోయిందని అమితాబ్ ఆ కంటెస్టెంట్‌కు సూచిస్తారు. ‘ఎవరు ఏది చెప్పినా వినండి.. కాని దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాకే నమ్మండి’ అని ఈ వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఒక్క ట్విటర్‌లోనే దీన్ని పది వేలమందికి పైగా లైక్ చేయడం గమనార్హం.
కాగా 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, 1000లు వంటి పెద్దనోట్లను రద్దు చేసి.. కొత్తగా రూ.2,000 నోట్లను చెలామణిలోకి తెచ్చారు. కాగా వీటిల్లో అంతర్గతంగా జీపీఎస్ ఉంటుందంటూ కొన్ని టీవీ ఛానళ్లు కథనాలు, వార్తలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
We all know that one person jo humein aisi unverified sansani khabrein sunata hai! Tag them in the comments and tell them that “Gyaan jahaan se mile bator lo, lekin pehle tatol lo.”#KBC2022 coming soon! Stay tuned!@SrBachchan pic.twitter.com/Y2DgAyP3MH
— sonytv (@SonyTV) June 11, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Home Remedies for Diarrhoea: అతిసారం బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి..