AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తండ్రి కథ.. నలుగురి పిల్లల కోసం ఏంచేశాడో తెలిస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు!

‘‘ సార్.. పిల్లలు ఏడుస్తున్నారు, తమ తల్లి కోసం వెతుకుతున్నారు. వాళ్ల అమ్మ తిరిగి రావడం లేదు.. నాకు సహాయం చేయండి... ఏడుస్తున్న నలుగురు చిన్న పిల్లలను వదిలి భార్య పారిపోయింది’’ నిస్సహాయుడైన తండ్రి చెప్పిన మాటలివి. పిల్లల తండ్రి తన భార్యను తిరిగి రమ్మని పదే పదే ప్రాధేయపడుతున్నాడు. భార్య చేష్టలతో మనస్తాపం చెందిన నలుగురు పిల్లల తండ్రి పోలీస్ స్టేషన్‌ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నాడు.

Viral News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తండ్రి కథ.. నలుగురి పిల్లల కోసం ఏంచేశాడో తెలిస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు!
Father
Balu Jajala
|

Updated on: Apr 04, 2024 | 4:51 PM

Share

‘‘ సార్.. పిల్లలు ఏడుస్తున్నారు, తమ తల్లి కోసం వెతుకుతున్నారు. వాళ్ల అమ్మ తిరిగి రావడం లేదు.. నాకు సహాయం చేయండి… ఏడుస్తున్న నలుగురు చిన్న పిల్లలను వదిలి భార్య పారిపోయింది’’ నిస్సహాయుడైన తండ్రి చెప్పిన మాటలివి. పిల్లల తండ్రి తన భార్యను తిరిగి రమ్మని పదే పదే ప్రాధేయపడుతున్నాడు. భార్య చేష్టలతో మనస్తాపం చెందిన నలుగురు పిల్లల తండ్రి పోలీస్ స్టేషన్‌ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నాడు. తన కష్టాలను వివరిస్తూ భార్య తిరిగి రప్పించేందుకు  ఎస్పీకి కూడా విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ లో శివప్రసాద్ 16 ఏళ్ల క్రితం రాణి అనే మహిళతో వివాహమైంది.

అంతకుముందు అంతా బాగానే ఉంది. వారిద్దరికీ నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కాలం గడిచిపోయింది. సాఫీగా సాగుతున్న కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. కొంతకాలంగా రాణి తన సొంత మేనల్లుడు రామ్ ఎఫైర్ పెట్టుకుంది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియలేదు. రాణి తరచుగా తన తల్లి ఇంటికి వెళ్లేది. అయితే ఓ రోజు వెళ్లిన భార్య తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రుల ఇంటికి రాలేదని తెలుసుకున్న శివప్రసాద్, రాణికి ఫోన్ చేయడం ప్రారంభించాడు. కానీ ఫోన్ తీయడం లేదు. శివప్రసాద్ భయపడ్డాడు. చండ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే తన అన్న కొడుకు అంటే తన మేనల్లుడు తో కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూశాడు.

ఆ ఫొటోలను చూసి శివప్రసాద్ షాక్ అయ్యాడు. ఎందుకంటే రామ్‌మిలన్‌తో ఉన్న ఫోటోలో అతని భార్య రాణి తప్ప మరెవరూ లేరు. రాణి రిలేషన్ లో ఉందని తెలుసుకున్నాడు. రామ్ మిలన్ వయసు 19 ఏళ్లు కాగా, రాణి వయసు 36 ఏళ్లు. ఇద్దరి వయసుల మధ్య 17 ఏళ్ల గ్యాప్ ఉంది. ఫోటోలో ఇద్దరూ రొమాంటిక్ పోజులు ఇచ్చారు. మళ్లీ రాణికి ఫోన్ చేశాడు. కానీ రాణి ఫోన్ ఎత్తలేదు. శివ ప్రసాద్ ఫోన్ కాల్ కు రామ్ రియాక్ట్ అయ్యాడు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడంతో అతనికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది.

అయితే పిల్లలు ఏడుస్తూన్నారని, అన్నీ మర్చిపోతాను. నేను నిన్ను కూడా క్షమిస్తాను. నా కోసం కాకపోతే, పిల్లల కోసం తిరిగి రండి అని వేడుకున్నా కానీ రాణి వెనక్కిరాలేదు. దీంతో శివప్రసాద్ తన భార్య రాణిని తిరిగి తీసుకురావాలని చంద్లా పోలీస్ స్టేషన్‌కు, ఛతర్‌పూర్ ఎస్పీకి దరఖాస్తు చేశాడు. న్యాయం కోసం నిత్యం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. పోలీసులు తప్పకుండా సాయం చేస్తారని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఈ తండ్రి కథ విన్నవాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..