Trending: కొండ అంచున అరుదైన వన్యప్రాణి.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో..

ప్రకృతి.. ఎన్నో రకాల జీవులకు, జంతువులకు, ప్రాణులకు నెలవు. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క ప్రాణి ఏదో ఒక రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది. కానీ.. మానవుని స్వార్థ ప్రయోజనాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు....

Trending: కొండ అంచున అరుదైన వన్యప్రాణి.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో..
Rare Animal
Follow us

|

Updated on: Dec 30, 2022 | 9:53 PM

ప్రకృతి.. ఎన్నో రకాల జీవులకు, జంతువులకు, ప్రాణులకు నెలవు. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క ప్రాణి ఏదో ఒక రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది. కానీ.. మానవుని స్వార్థ ప్రయోజనాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. విచ్చలవిడిగా అడవులను నరికేస్తుండటంతో అందులో నివసించే జంతువుల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో చాలా రకాల జంతువులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అలాంటి జంతువులు ఎక్కడైనా కనిపించినప్పుడు వాటిని వెంటనే ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు జంతు ప్రేమికులు. అవి క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంటాయి. తాజాగా ఐఏఎస్ ఆఫీస‌ర్‌ సుప్రియా సాహూ ట్విట్టర్‌లో ఓ వన్యప్రాణికి సంబంధించిన ఫోటో షేర్‌ చేశారు.

తమిళనాడు రాష్ట్ర జంతువు అయిన తహర్‌ అంతరించిపోయే దశలో ఉంది. ఈ జంతువును రక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ నీలగిరి తహర్‌ ఓ కొండ అంచున చెట్టు కొమ్మపై నిల్చుని ఉన్న ఫోటోను సుప్రియా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ జంతువును చూస్తే అయ్యో ఆపదలో ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇవి ఎత్తైన కొండల్ని, ఎంతో అవలీలగా ఎక్కేస్తాయట. ఇవి పశ్చిమ కనుమల్లోని పచ్చికబయళ్లలో నివసిస్తాయట.

ఇవి కూడా చదవండి

ఈ ఫోటోను షేర్‌ చేస్తూ ‘నిజ‌మైన ఖ‌త్రోం కే ఖిలాడీ. వీటి సంర‌క్షణ‌కు త‌మిళ‌నాడు ప్రభుత్వం ప్రాజెక్టు మొద‌లు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ‘ అంటూ ఆ క్యాప్షన్ పెట్టారు. కాగా ఈ తహర్‌.. ఒవిస్ జాతికి చెందిన గొర్రెల‌ను పోలి ఉంటాయి. వీటి కొమ్ములు వంపు తిరిగి ఉంటాయి. ఇవి నీల‌గిరి అడువుల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ప్రస్తుతం ఈ నీల‌గిరి త‌హ‌ర్ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..